Begin typing your search above and press return to search.

సుక్కు కూతురిలో మరో టాలెంట్.. స్టన్ అయ్యేలా..

ఫుల్ బిజీయస్ట్ దర్శకుడుగా సుకుమార్ ప్రస్తుతం ఉన్నారు. అతని లైన్ అప్ లో రామ్ చరణ్, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు

By:  Tupaki Desk   |   25 May 2024 4:48 AM GMT
సుక్కు కూతురిలో మరో టాలెంట్.. స్టన్ అయ్యేలా..
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో వినిపించే పేరు సుకుమార్. పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీని కూడా అదే లెవెల్ లో ఆవిష్కరించి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని చాలా ప్లానింగ్ తో లోకల్ ఫ్లేవర్ మిస్ కాకుండా యూనివర్సల్ అప్పీల్ తీసుకొచ్చి విజువల్ వండర్ గా ఆవిష్కరించే ప్రయత్నం సుకుమార్ చేస్తున్నారు.

ఫుల్ బిజీయస్ట్ దర్శకుడుగా సుకుమార్ ప్రస్తుతం ఉన్నారు. అతని లైన్ అప్ లో రామ్ చరణ్, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. సుకుమార్ ఓవైపు డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా తన శిష్యులను దర్శకులుగా ప్రమోట్ చేస్తున్నారు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అందులో అసిస్టెంట్ లని దర్శకులుగా పరిచయం చేస్తూ పర్ఫెక్ట్ మాస్టర్ అని సుకుమార్ అనిపించుకుంటున్నారు.

సుకుమార్ కుటుంబానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. సుకుమార్ కూతురు తండ్రి బాటలోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తోంది. సుకుమార్ కూతురు సుకృతవేణి నటిగా అరంగేట్రం చేసి గాంధీ తాత చెట్టు అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఈ చిత్రానికి గాను 14వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులలో బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్డుని సుకృతివేణి అందుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ రాక్ బ్యాండ్ లో సుకృత వేణి స్టేజ్ పైన ఇంగ్లీష్ సాంగ్ ఆలపించి అందరిని మంత్రముగ్ధులను చేసింది. దీంతో సుకుమార్ కూతురిలో సింగింగ్ టాలెంట్ కూడా ఉందా అని టాలీవుడ్ లో అందరూ చర్చించుకుంటున్నారు. కూతురు ఇలా తనకి ఇష్టమైన రంగంలో ప్రతిభ చూపిస్తే ఏ తండ్రి కైనా గర్వంగానే ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా సుకుమార్ తన కూతురిపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ సుకృతవేణి పాడిన సాంగ్ వీడియోని సుకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో కాస్త ట్రెండ్ అవుతోంది. సుకుమార్ కూతురు సింగింగ్ టాలెంట్ చూసిన తర్వాత భవిష్యత్తులో కచ్చితంగా టాలీవుడ్ లో మంచి గాయనిగా గుర్తింపు తెచ్చుకుంటుందని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు.