Begin typing your search above and press return to search.

పుష్ప 2.. ఓ పద్ధతి ఓ ప్లాను..

ఒక విధంగా చెప్పాలి అంటే అందరికంటే భిన్నంగా రివర్స్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ముందుగా ఒక ట్రైలర్ తరహాలో అసలు పుష్పరాజ్ పై క్యూరియసిటీని క్రియేట్ చేశారు.

By:  Tupaki Desk   |   10 April 2024 2:30 PM GMT
పుష్ప 2.. ఓ పద్ధతి ఓ ప్లాను..
X

డైరెక్టర్ సుకుమార్ గురించి గతంలో రాజమౌళి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. త్రివిక్రమ్ సుకుమార్ లాంటి దర్శకులు కంప్లీట్ మాస్ హై వోల్టేజ్ సినిమాలు తీస్తే గనక మామూలుగా ఉండదు అని మాలాంటి వాళ్లు కూడా సర్దేసుకోవాల్సిందే అనేలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ విషయంలో ఇప్పటికే సుకుమార్ తనేంటో నిరూపించుకున్నాడు. పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ ఏదో హడావిడిగా పూర్తిచేసి విడుదల చేశారు.

కానీ సినిమాలో సుక్కు మేకింగ్ విధానానికి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో ఏకంగా 100 కోట్లు రావడం విశేషం. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలో అంతకుమించి అనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమాను చాలా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అసలైతే పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూట్ చాలావరకు ముందే ఫినిష్ అయ్యింది.

కానీ ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నిర్మాతలు దర్శకుడు హీరో ఆ పాత సీన్స్ పక్కన పెట్టేశారు. మళ్ళీ ఫ్రెష్ గా అంతకుమించి అనేలా గ్రాండ్ గా డిజైన్ చేయాలి అని సుకుమార్ మరింత టైం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేస్తున్న విధానంలో కూడా దర్శకుడు ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నట్లు అనిపిస్తోంది.

ఒక విధంగా చెప్పాలి అంటే అందరికంటే భిన్నంగా రివర్స్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ముందుగా ఒక ట్రైలర్ తరహాలో అసలు పుష్పరాజ్ పై క్యూరియసిటీని క్రియేట్ చేశారు. అప్పట్లో బాహుబలి సినిమాకు సంబంధించి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడు అనే ఒక డౌట్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బాహుబలి2 వచ్చే వరకు జనాల్లో ఆ ప్రశ్న బలంగా నానింది.

ఇక సుక్కు కూడా ఏదైనా అలాంటి ఒక ప్రశ్నను జనాల్లో బలంగా పడేలా చేయాలి అనుకున్నాడో ఏమో కానీ పుష్పరాజ్ ఏమయ్యాడు అనే ప్రశ్నను ను ఒక ట్రైలర్ తరహాలో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చాడు. ఇక రీసెంట్ గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా అతని క్యారెక్టర్ ను హైలెట్ చేసే విధంగా టీజర్ ను వదిలాడు అందులో ఆ లుక్కు తోనే సినిమాను చూడాలి అనేంతలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు.

స్టోరీ ప్లాట్ క్యారెక్టర్ విషయంలో సుక్కు జనాలకు ఇవ్వాలనుకున్న క్లారిటీ ఇచ్చేసాడు అనిపిస్తోంది. సాధారణంగా మొదట ఫస్ట్ గ్లింప్స్ ఆ తర్వాత టీజర్ అనంతరం ట్రైలర్ అనే ఫార్మాట్లోనే అందరూ కొనసాగుతున్నారు. కానీ సుక్కు మాత్రం ఫస్ట్ ట్రైలర్ లాంటి ఒక స్టోరీ పాయింట్ ను హైలెట్ చేశాడు. ఇక టీజర్ తో ఇటీవల క్యారెక్టర్ ను హైలెట్ చేశాడు. మరి నెక్స్ట్ గ్లింప్స్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి.