Begin typing your search above and press return to search.

సమంతని మరపించే వారికోసం 'పుష్ప' సెర్చింగ్‌

సుకుమార్‌ పుష్ప 2 కోసం మాత్రం అంత ఈజీగా హీరోయిన్ ని ఎంపిక చేయలేక పోతున్నాడు

By:  Tupaki Desk   |   5 Aug 2023 11:41 AM GMT
సమంతని మరపించే వారికోసం పుష్ప సెర్చింగ్‌
X

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా రూ.400 కోట్ల కు పైగా వసూళ్లు నమోదు చేయడంతో పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప 2 సినిమా షూటింగ్‌ దాదాపు సగానికి పైగా పూర్తి అయింది. గత కొన్నాళ్లుగా పుష్ప 2 కోసం ఐటం సాంగ్‌ ని ఎవరితో చేయిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పుష్ప సినిమా లో సమంత తో ఊ అంటావా.. పాటను చేయించిన సుకుమార్‌ పుష్ప 2 కోసం మాత్రం అంత ఈజీగా హీరోయిన్ ని ఎంపిక చేయలేక పోతున్నాడు. బాలీవుడ్‌ టచ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలోని ఐటం సాంగ్‌ ను బాలీవుడ్‌ హీరోయిన్ తో చేయించాలని చర్చలు జరిపాడు. కానీ ఉత్తరాది ముద్దుగుమ్మలు సెట్‌ అవ్వలేదు.

ఇక సౌత్‌ కు చెందిన ఇద్దరు ముగ్గురు స్టార్‌ హీరోయిన్స్ తో కూడా చర్చలు జరిపాడట. అందులో కూడా ఏ ఒక్కరికి సెట్‌ అవ్వలేదు. ముఖ్యంగా శ్రీ లీల తో పుష్ప 2 లో ఐటం సాంగ్ ను చేయించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. మైత్రి వారు శ్రీ లీలకు భారీ పారితోషికం కూడా ఆఫర్‌ చేశారట. కానీ ఆమె నుండి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని సమాచారం.

ప్రస్తుతం శ్రీలీల ఉన్న బిజీ తో పాటు.. ఆమె క్రేజ్ కి ఐటం సాంగ్‌ చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. ఆమె నిర్ణయం కూడా అదే అయి ఉంటుంది. సమంత పుష్ప లో ఐటం సాంగ్ చేసి ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్‌ చేసింది.

ఆ మార్క్‌ ను బీట్ చేయకున్నా కనీసం ఆ మార్క్ ను చేరుకునే విధంగా అయినా ఐటం సాంగ్‌ ను చేయించాలని సుకుమార్‌ భావిస్తున్నాడు. అందుకే సెర్చింగ్ కంటిన్యూ అవుతోంది.