Begin typing your search above and press return to search.

వీడియో: గ్లామ్- జోష్‌లో పంజాబీ ర్యాప‌ర్ త‌గ్గేదేలే

పంజాబీ పాప్ ప్ర‌పంచం ఎప్పుడూ పోష్ క‌ల్చ‌ర్ తో విస్మ‌య‌ప‌రుస్తుంది. డ‌జ‌న్ల కొద్దీ పాప్ సింగ‌ర్లు ఉర్రూత‌లూగిస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 9:35 AM IST
వీడియో: గ్లామ్- జోష్‌లో పంజాబీ ర్యాప‌ర్ త‌గ్గేదేలే
X

పంజాబీ పాప్ ప్ర‌పంచం ఎప్పుడూ పోష్ క‌ల్చ‌ర్ తో విస్మ‌య‌ప‌రుస్తుంది. డ‌జ‌న్ల కొద్దీ పాప్ సింగ‌ర్లు ఉర్రూత‌లూగిస్తూనే ఉన్నారు. కొన్నేళ్లుగా సుఖ్‌దీప్ సింగ్ అలియాస్ సుఖ్ -ఇ పంజాబీ పాప్ క‌ల్చ‌ర్ లో ఒక భాగంగా ఉన్నాడు. అత‌డు తన రంగస్థల నామం సుఖ్-ఇ లేదా సుఖ్-ఇ మ్యూజికల్ డాక్టర్జ్ తో చాలా పాపుల‌ర‌య్యాడు. పంజాబీ, హిందీ భాషా పాటలతో ఉర్రూత‌లూగించే ప్ర‌ముఖుడు అత‌డు. గాయకుడు,గేయ రచయిత, సంగీత ద‌ర్శ‌కుడిగా, నిర్మాతగా కొన‌సాగుతున్నాడు. అత‌డు మ‌రో ప్ర‌ముఖ ర్యాప‌ర్ రఫ్తార్‌తో తన మొదటి సింగిల్ 'స్నిపర్'ను ప్రారంభించాడు. బోహేమియాతో అతడి 2015 సింగిల్ 'జాగ్వార్' యువ‌త‌రాన్ని ఆక‌ర్షించింది.

ఇప్పుడు సుఖ్ మ‌రో కొత్త సింగిల్ తో యువ‌త‌రం హృద‌యాల‌ను కొల్ల‌గొడుతున్నాడు. ''నీ ఎహ్ తా తేరి మార్జియీ దిల్ దే యా దిల్ తోడ్ దే...'' అనేది లేటెస్ట్ సాంగ్. అధికారిక మ్యూజిక్ వీడియో సోష‌ల్ మీడియాల్లోకి వ‌చ్చింది. సుఖ్ ఎప్ప‌టిలానే ఎంతో ఎన‌ర్జిటిక్ గా క‌నిపించ‌గా ఫీమేల్ పెర్ఫామ‌ర్ గ్లామ‌ర‌స్ లుక్స్ తో క‌ట్టి ప‌డేస్తోంది.

సుఖ్‌దీప్ గురించి మ‌రింత డీప్ గా వివ‌రాల్లోకి వెళితే.. అత‌డు పంజాబ్‌లోని గర్హ్‌శంకర్‌కు చెందినవాడు. ఉన్నత చదువుల కోసం చండీగఢ్‌కు వెళ్ళాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత అతడు మ్యూజికల్ డాక్టర్జ్ అనే బ్యాండ్‌ను స్థాపించాడు. అయితే మ‌రో గాయ‌కుడు ప్రీత్ హుండాల్‌తో విడిపోయాడు కానీ 'మ్యూజికల్ డాక్టర్జ్' అనే పేరుతో చాలా పాపుల‌ర‌య్యాడు. ఈ సంస్థ‌లో అతడు కొత్త గాయకులు, రాపర్‌లతో ఒప్పందం కుదుర్చుకుని పాట‌ల్ని అందిస్తున్నాడు. కాలేజ్ డేస్ నుంచి సంగీతం అంటే త‌న‌కు చెవి కోసుకునేంత ఇష్టం అని సుఖ్ చెప్పాడు.

అతను స్నిపర్ ఫీట్ అనే పాటతో అరంగేట్రం చేశాడు. రఫ్తార్, సుఖ్-ఇ బోహేమియాతో కలిసి 'జాగ్వార్' అనే సింగిల్ రిలీజ్ చేసి ప్రజాదరణ పొందాడు. అతడు మళ్ళీ రఫ్తార్‌తో కలిసి మరో సింగిల్ `ఆల్ బ్లాక్`కి ప‌ని చేసాడు. అతడు జానీ - అవ్వి స్రాతో కూడా పనిచేస్తున్నాడు. ఆ త‌ర్వాత కెరీర్ లో చాలా ఆల్బ‌మ్స్ రిలీజ్ చేసాడు.