Begin typing your search above and press return to search.

జాక్వెలిన్ తల్లికి సుఖేష్ నివాళి.. బాలిలో తులసి, లిల్లీలతో ప్రత్యేక ఉద్యానవనం!

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది

By:  Tupaki Desk   |   24 April 2025 8:14 PM IST
జాక్వెలిన్ తల్లికి సుఖేష్ నివాళి.. బాలిలో తులసి, లిల్లీలతో ప్రత్యేక ఉద్యానవనం!
X

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడు కొన్నాళ్ల కిందట మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ప్రేమాయణం నడిపిందని టాక్ నడిచింది. ఇద్దరు కలిసి డేటింగ్ చేశారని కూడా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు సుఖేష్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. పోలీసులు జాక్వెలిన్‌ను విచారించగా సుఖేష్ నుంచి తను చాలా ఖరీదైన గిఫ్టులు తీసుకున్నాన్నట్లు ఒప్పుకుందని సమాచారం.

అయితే విషయం ఏంటంటే, సుఖేష్ జైల్లో ఉన్నాగానీ జాక్వెలిన్‌ను మాత్రం మర్చిపోలేకపోతున్నాడట. అందుకే ఆమెకు ఇప్పటికీ ఖరీదైన గిఫ్టులు పంపిస్తూనే ఉన్నాడట.సుఖేష్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆమె అంగీకరించింది. మొన్నామధ్య జాక్వెలిన్ తల్లి కీమ్ ఫెర్నాండెజ్ చనిపోవడంతో వాళ్ల కుటుంబం మొత్తం విషాదంలో ఉంది.

జాక్వెలిన్ తల్లి జ్ఞాపకార్థం సుఖేష్ ఏకంగా బాలిలో ఒక తులసి వనాన్ని కొని తనకు గిఫ్టుగా ఇచ్చాడట. "బాలిలో ఒక పెద్ద పొలం కొన్నాను. అదిప్పుడు పూర్తిగా ప్రైవేట్ గార్డెన్. దాని పేరు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మీద 'కీమ్స్ గార్డెన్'. మీ అమ్మ జ్ఞాపకార్థం ఈరోజు ఈస్టర్ గిఫ్టుగా ఇస్తున్నా" అని సుఖేష్ జాక్వెలిన్‌కు లేఖ రాశాడట. దీనిపై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంకా స్పందించలేదు.