Begin typing your search above and press return to search.

OG సుజిత్.. అప్పుడే మరో కాంబో సెట్ చేశాడా?

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సుజిత్ సొంతం చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 4:36 AM GMT
OG సుజిత్.. అప్పుడే మరో కాంబో సెట్ చేశాడా?
X

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సుజిత్ సొంతం చేసుకున్నాడు. రన్ రాజా రన్, సాహో సినిమాలతో తన ప్రతిభ చూపించాడు. ఏకంగా మూడో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశాన్ని సుజిత్ సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న OG మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే 70 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ కారణంగా మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఓ 15 రోజులు పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీపైన చాలా హైప్ ఉంది. పాన్ ఇండియా లెవల్ లో పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే పాన్ ఇండియా ఇమేజ్ తో వస్తోన్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ పీక్ లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే సిద్ధమవుతోన్న ఈ సినిమాలో ఒజాస్ గంభీర అనే గ్యాంగ్ స్టార్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. OG తర్వాత సుజిత్ మరల మాఫియా బ్యాక్ డ్రాప్ కథతోనే మూవీ చేయబోతున్నాడంట. అది నేచురల్ స్టార్ నానితో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నానికి కథ వినిపించి ఒకే చేయించుకున్నాడంట.

ఈ చిత్రాన్ని కూడా డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. OG కంప్లీట్ చేసిన తర్వాత నానితో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని సుజిత్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే నానితో మూవీస్ చేయడానికి ఇప్పటికే బలగం వేణు సిద్ధంగా ఉన్నారు. దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించే ఆలోచనలో ఉన్నారు.

అలాగే నానికి దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఒదేల కూడా నానికి మరో కథ చెప్పి ఒకే చేయించుకున్నాడు. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే నాని నెక్స్ట్ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది