Begin typing your search above and press return to search.

సుహాస్ రెమ్యునరేషన్.. అంతవరకు వెళ్లిందా..

ఇప్పుడు అర్జున్ వైకే డైరెక్షన్ లో మరో యూనిక్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

By:  Tupaki Desk   |   7 March 2024 10:40 AM GMT
సుహాస్ రెమ్యునరేషన్.. అంతవరకు వెళ్లిందా..
X

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు సుహాస్. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు అర్జున్ వైకే డైరెక్షన్ లో మరో యూనిక్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రసన్నవదనం అంటూ పలకరించేందుకు సిద్ధమయ్యారు హీరో సుహాస్. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్ల పై ప్రొడ్యూసర్లు మణికంఠ, ప్రసాద్ రెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది. ఇందులో సుహాస్ ఫేస్ బ్లైండ్‌ నెస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు మేకర్స్ చూపించారు.

ఈ మూవీ టీజర్‌ విడుదల సందర్భంగా ప్రసన్న వదనం చిత్రబృందం మీడియాతో మాట్లాడింది. ఇక మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు సుహాస్. ప్రసన్నవదనం మూవీలో ఇప్పటివరకు చూడని సుహాస్‌ ను చూస్తారని హీరో చెప్పారు. తాను చాలా స్టైలిష్‌ గా కనిపిస్తానని తెలిపారు. ప్రతీ అంశాన్ని మేకర్స్ బాగా చూపారని అన్నారు.

ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన తర్వాత రెమ్యునరేషన్ పెంచారన్న టాక్ వస్తోంది.. నిజమేనా అని సుహాస్ ను ఓ రిపోర్టర్ అడిగారు. ఆ ప్రశ్నకు ఓపికగా సమాధానమిచ్చారు సుహాస్. పెంచాలి గా మారి.. నేను బ్రతకొద్దా.. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను.. రోజుకు రూ.100 నుంచి తీసుకుని వచ్చాను.. తీసుకోవాలని అనుకుంటా నేను కూడా అని ఆన్సర్ ఇచ్చారు.

అయితే రూ.3వేలు నుంచి రూ.3 కోట్ల వరకు ఎదిగారని టాక్ వినిపిస్తోంది అది కూడా నిజమేనా అని అడగ్గా.. 1000 రూపాయల నుంచి 3 కోట్లు అనుకో, మరీ అంత తీసుకోవట్లేదు లెండి అని నవ్వుతూ చెప్పారు సుహాస్. దీంతో నిజంగానే రెమ్యునరేషన్ పెంచినట్లు సుహాసే కన్ఫర్మ్ చేశారు. దాదాపు కోటి రూపాయలకు పైనే సుహాస్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. అయితే కష్టపడి పైకి వచ్చి సక్సెస్ లు కొట్టేవాళ్లు మార్కెట్ కు తగ్గట్టు రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదని నెటిజన్లు అంటున్నారు.