Begin typing your search above and press return to search.

సుహాస్ మరొకటి.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ రీఎంట్రీ

సుహాస్ మరో కొత్త మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఓ భామ అయ్యో రామగా ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.

By:  Tupaki Desk   |   30 March 2024 11:44 AM GMT
సుహాస్ మరొకటి.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ రీఎంట్రీ
X

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్.. ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో వచ్చి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ప్రస్తుతం సుహాస్ చేతి నిండా సినిమాలు ఉండగా.. త్వరలో రెండు మూడు మూవీలు రిలీజ్ కానున్నాయి.


సుహాస్ మరో కొత్త మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఓ భామ అయ్యో రామగా ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో తమిళ మూవీ జోయ్ ఫేమ్ మాళవిక మనోజ్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఉదయ్ కిరణ్ నువ్వు నేను మూవీ ఫేమ్.. అనిత హాసనందిని ఈ మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. లీడ్ రోల్ లో నటిస్తుంది. రామ్ గోడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.


వి ఆర్ట్స్ అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ బ్యానర్ పై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తాళ్లపు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. ద‌ర్శకుడు వ‌శిష్ఠ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. మ‌రో ద‌ర్శ‌కుడు కొల‌ను శైలేష్ బౌండెడ్ స్కిప్ట్‌ ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. డైరెక్టర్ విజయ్ క‌న‌క‌మేడ‌ల‌ రివీల్ చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ఇక పూజా కార్యక్రమాలు పూర్తైన అనంతరం.. సుహాస్ మీడియాతో మాట్లాడారు. "ద‌ర్శ‌కుడు మారుతి గారి ద‌గ్గ‌ర డైరెక్ష‌న్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు రామ్ గోడలతో పరిచయం ఏర్పడింది. మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని రామ్ తెర‌కెక్కిస్తున్నారు. నా అభిమాన న‌టుల‌తో న‌టించే అవ‌కాశం నాకు ఈ సినిమాతో దొరికింది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దోనని వెయిట్ చేస్తున్నా" అని సుహాస్ తెలిపారు.

"ఈ సినిమా ఒక బ్యూటీఫుల్ లవ్‌ స్టోరీ, కొత్త‌గా ద‌ర్శ‌క‌త్వం చేసే వాళ్ల‌కు సుహాస్ దొరికిన వ‌రం. ఎంతో కంఫ‌ర్ట‌బుల్ ఆర్టిస్ట్‌. వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, సెలెక్టివ్ సినిమాలు చేస్తున్నారు. అలాంటి సుహాస్ తో సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా మంచి టెక్నిషీయ‌న్స్‌ ను అందుబాటులోకి తెచ్చారు. ర‌థ‌న్ సంగీతం చిత్రానికి అద‌న‌పు బలం" అని దర్శకుడు రామ్ తెలిపారు. మరి ఈ మూవీతో సుహాస్ మరో హిట్ కొడతారో లేదో చూడాలి.