సుహాసిని ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనా? 63ఏళ్ల వయసులోనూ ఫుల్ ఎనర్జీ!
వయసు పెరిగేకొద్దీ చాలామంది తమ శారీరక చురుకుదనాన్ని తగ్గించుకుంటారు. కానీ కొందరు మాత్రం వయసును నెంబర్ గానే తీసుకుని కొత్త విషయాలను నేర్చుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 29 May 2026 12:02 PM ISTవయసు పెరిగేకొద్దీ చాలామంది తమ శారీరక చురుకుదనాన్ని తగ్గించుకుంటారు. కానీ కొందరు మాత్రం వయసును నెంబర్ గానే తీసుకుని కొత్త విషయాలను నేర్చుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం ఒకరు. 63 ఏళ్ల వయసులో కూడా ఆమె జుంబా, సాల్సా వంటి డాన్స్ ఫార్మ్స్‌తో పాటు 63 ఏళ్ల వయసులో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రీసెంట్ గా రైటర్ సుధా మీనన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుహాసిని తన ఫిట్‌నెస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"నేను జుంబా చేస్తాను. సాల్సా చేస్తాను. 63 ఏళ్ల వయసులో భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. నా టీచర్ మీరు అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ నేను ప్రేక్షకుల కోసం కాదు, నా కోసం నేనే నాట్యం చేస్తున్నానని" చెప్పానంటూ సుహాసిని చెప్పిన మాటలు ఎంతో మందిని ప్రేరేపిస్తున్నాయి. వయసు పెరిగినా కొత్తగా నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆమె మరోసారి నిరూపించారు. ముఖ్యంగా భరతనాట్యం వంటి కఠినమైన శాస్త్రీయ నృత్యాన్ని ఈ వయసులో ప్రారంభించడం ఎంతో మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఆరోగ్య నిపుణులు కూడా సుహాసిని నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. వయసు ఒక్కటే పరిమితి కాదు. వ్యక్తిగత ఫిట్‌నెస్, మెడికల్ హిస్టరీ ముఖ్యమైనవి. భరతనాట్యం వంటి నృత్యాలకు శరీర బలం, సమతుల్యత, ఫ్లెక్సిబిలిటీ అవసరమని, సరైన మార్గదర్శకత్వంలో క్రమంగా నేర్చుకుంటే ఇవి కండరాల బలం పెంచడంతో పాటూ మొబిలిటీ మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. అయితే ఒక్కసారిగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మోకాళ్లు, కాళ్ల మడమలు, నడుముపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా భరతనాట్యంలో ఉండే డీప్ నీ బెండ్స్, స్టాంపింగ్ మూమెంట్స్, ఫుట్‌వర్క్ కారణంగా మోకాళ్ల సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని కూడా వారు సూచిస్తున్నారు.
అయితే సరైన టెక్నిక్, క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టితే డ్యాన్స్ వయసుతో సంబంధం లేకుండా జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. డాన్స్ కేవలం వినోదం మాత్రమే కాదు, అది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాగా సుహాసిని చెప్పిన తాను ఆడియన్స్ కోసం కాదు, తన కోసమే డాన్స్ చేస్తున్నాననే మాటలు జీవితాన్ని ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప సందేశంగా మారాయి.
