థగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ ఆవిడే ఇస్తుందా?
మణిరత్నం సినిమాలను బయట వారు ఎవరో విమర్శించాల్సిన పనిలేదు. ఆయన విమర్శించే మనిషి ఇంట్లోనే ఉన్నారు.
By: Tupaki Desk | 20 May 2025 7:00 AM ISTమణిరత్నం సినిమాలను బయట వారు ఎవరో విమర్శించాల్సిన పనిలేదు. ఆయన విమర్శించే మనిషి ఇంట్లోనే ఉన్నారు. ఆవిడే సతీమణ సుహాసిని. మణిసార్ సినిమాలకు ఆమె పెద్ద క్రిటిక్. ఇప్పటివరకూ మణిరత్నం చాలా హిట్లు అందించారు. వాటిలో చాలా వాటికి సుహాసిని రివ్యూలు ఇచ్చారు. అయితే ఈ రివ్యూ అన్నది కేవలం వాళ్లిద్దరి మద్యే ఉంటుంది. సినిమాలో తప్పొప్పులను ఎత్తు చూపి ఎన్నడు గొప్ప సినిమా తీసింది లేదని మణిసార్ ని సుహాసిని చాలాసార్లు విమర్శించారు.
మూడు కు మూడు రేంటింగ్ ఎన్నడు ఇవ్వలేదు. ఈ విషయాలన్ని ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం స్వయంగా చెప్పారు. తన భార్య కన్నా బయట వాళ్లే చాలా బెటర్ అంటూ నవ్వేసారు. మరి సుహాసిని తొలిసారి భర్త సినిమా విషయంలో పబ్లిక్ రివ్యూ కు రెడీ అవుతున్నారా? అంటే అవుననే ఓ వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన `థగ్ లైఫ్` జూన్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
కమల్ హాసన్ -మణిరత్నం మూడు దశాబ్దాల తర్వాత కలిసి చేసిన చిత్రమిది. సినిమాపై భారీ అంచనా అంచనాలున్నాయి. సినిమా ఎలా ఉండబోతంది? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఫస్ట్ రివ్యూ ఎవరు పోస్ట్ చేస్తారా? అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి సుహాసిని పబ్లిక్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నారట. తొలి షో చూసిన అనంతరం తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా అభిమా నులతో పంచుకోవాలనుకుంటున్నారు. అదీ మణిరత్నం అనుమతి లేకుండా.
ఆ విశ్లేషణ ఎంతో పారదర్శకంగా ఉండాలని ఆమె సంకల్పించారుట. ఉన్నది ఉన్నట్లు చెప్పాలని...భర్త సినిమా అని వెనకేసుకురావాల్సిన పనిలేదని భావిస్తున్నట్లు కోలీవుడ్ లీకుల ద్వారా తెలుస్తోంది. మరి ఏ కారణంగా ఈ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నారు అంటే కమల్ -మణిరత్నం మళ్లి ఎంత కాలానికి పని చేస్తారో తెలియదు. మళ్లీ చేతులు కలుపుతారో లేదో కూడా చెప్పలేం. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. నాటి `నాయకుడు` విషయంలో ఆ ఛాన్స్ లేకపోయినా....నేటి `థగ్ లైఫ్` కి అన్ని అవకాశాలు ఉండటంతో సుహాసిని ఛాన్స్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది.
