Begin typing your search above and press return to search.

కేబుల్ రెడ్డిగా మారిపోయిన సుహాస్..!

కేబుల్‌ రెడ్డి నవ్వులతో మీ గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు అంటూ క్యాప్ష‌న్ కూడా జోడించారు. పోస్టర్ ను బట్టి సుహాస్ ఈ సినిమాలో కేబుల్ ఆప‌రేట‌ర్‌గా ప‌ని చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 10:59 AM GMT
కేబుల్ రెడ్డిగా మారిపోయిన  సుహాస్..!
X

ప్రముఖ నటుడు సుహాస్ తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టాడు. హీరో పక్కన రోల్స్ చేసే సుహాస్ సడెన్ గా కలర్ ఫోటో మూవీతో హీరోగా మారాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కలర్ ఫోటో తో రూట్ మొత్తం మార్చేశాడు. ఆ సినిమాలో తన నటనతో అందరితో కన్నీళ్లు పెట్టించిన సుహాస్ తర్వాత హిట, సెకండ్ కేసులో విలన్ గా క్రూరత్వం చూపించాడు.


ఆ తర్వాత ఈ ఏడాది మొదట్లో రైటర్ పద్మభూషణ్’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా కేబుల్ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకి సుహాస్ స్నేహితుడు శ్రీధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సుహాస్ సరసన షాలిని కొండేపూడి నటిస్తోంది.

ఈ చిత్రాన్ని ఫ్యాన్‌ మేడ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీకి మహిరెడ్డి పండుగల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స్మరణ్‌ సాయి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కాగా, ఈ మూవీ నుంచి తాజాగా సుహాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

మూవీ టైటిల్ లాగానే, ఫస్ట్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కేబుల్‌ రెడ్డి నవ్వులతో మీ గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు అంటూ క్యాప్ష‌న్ కూడా జోడించారు. పోస్టర్ ను బట్టి సుహాస్ ఈ సినిమాలో కేబుల్ ఆప‌రేట‌ర్‌గా ప‌ని చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆయన వెనక చాలా టీవీలు ఉన్నాయి. ఒక్కో టీవీలో ఒక్కో ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతోంది. క్రికెట్, సినిమా, సీరియల్ ఇలా అన్నీ చూపించారు.

ఈ మూవీని వచ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ మూవీతో మరోసారి సుహాస్ హిట్ కొట్టడం పక్కా అనే ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా, సుహాస్ చేతిలో మరో సినిమా కూడా ఉంది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.