Begin typing your search above and press return to search.

సిగ్గుతో లిప్‌ లాక్‌ విషయం చెప్పిన హీరో..!

మొదటి సారి తాను ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశం చేశాను. నేను నా జీవితంలో సినిమాలో లిప్ లాక్ చేస్తాను అనుకోలేదు.

By:  Tupaki Desk   |   8 March 2024 5:42 AM GMT
సిగ్గుతో లిప్‌ లాక్‌ విషయం చెప్పిన హీరో..!
X

యూట్యూబ్‌ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుని, చిన్న సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపిస్తూ మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూ కలర్‌ ఫోటో సినిమాలో హీరోగా నటించడం ద్వారా ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకున్న నటుడు సుహాస్‌.

టాలీవుడ్ లో కమెడియన్స్ హీరోలు అవ్వడం కొత్తేం కాదు. ఆ దారిలోనే సుహాస్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. గతంలో వచ్చిన కమెడియన్స్ తో పోల్చితే నేను చాలా విభిన్నం అన్నట్లుగా ఆయన సినిమాలతో చెప్పకనే చెబుతున్నాడు.

కలర్‌ ఫోటో సినిమా తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సుహాస్‌ ఆ తర్వాత రైటర్‌ పద్మభూషన్‌, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌ సినిమాలతో వరుసగా సక్సెస్ లను దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన నుంచి రాబోతున్న తదుపరి సినిమా ప్రసన్న వదనం. తాజాగా టీజర్ విడుదల చేశారు. హీరో విభిన్నమైన సమస్యతో బాధ పడుతున్నట్లు టీజర్ లో చూపించి సినిమా పై ఆసక్తి పెంచారు.

ప్రసన్నవదనం సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో సుహాస్‌ మాట్లాడుతూ.. మొదటి సారి తాను ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశం చేశాను. నేను నా జీవితంలో సినిమాలో లిప్ లాక్ చేస్తాను అనుకోలేదు. ఈ విషయాన్ని చెప్పడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది.

లిప్ లాక్‌ సీక్వెన్స్ లో నటించిన సమయంలో కూడా చాలా సిగ్గు పడ్డాను అన్నట్లుగా సుహాస్‌ చెప్పుకొచ్చాడు. లిప్ లాక్ గురించి సిగ్గు పడుతూ సుహాస్‌ చెప్పిన విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రసన్న వదనం హిట్ అయితే ముందు ముందు సినిమాల్లో కూడా సుహాస్‌ లిప్‌ లాక్ చేసే అవకాశం ఉంది. అప్పుడు సుహాస్‌ సిగ్గు పడకుండా సీన్ చేస్తాడేమో చూడాలి.