Begin typing your search above and press return to search.

కోలీవుడ్ ఎంట్రీ.. క్యారెక్టర్ గుట్టు విప్పిన సుహాస్

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. వైల్డ్ లుక్ లో సుహాస్ ఆకట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   6 May 2025 8:21 AM
Tollywood Actor Suhas Makes Kollywood Debut as a Villain in Mandaadi
X

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌, శ్రీరంగ నీతులు, జ‌న‌క అయితే గ‌న‌క‌, ప్ర‌స‌న్న వ‌ద‌నం, గొర్రె పురాణం అంటూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు తెలుగులో మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు సుహాస్.

అదే సమయంలో కోలీవుడ్ మూవీ మండాడిలో కూడా యాక్ట్ చేస్తున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. యాక్టర్ సూరి లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్.. గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఆ మూవీకి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు.

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. వైల్డ్ లుక్ లో సుహాస్ ఆకట్టుకున్నారు. ఆయన మేకోవర్ చూసి అంతా షాకయ్యారు. కోలీవుడ్ లో సుహాస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారని అంతా కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో కొద్దిరోజులుగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సూరి తమిళ వెర్షన్ లో హీరోగా నటిస్తున్నారని, తెలుగులో హీరోగా సుహాస్ యాక్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా సోషల్ మీడియాలో సుహాస్ క్లారిటీ ఇచ్చారు. మండాడి సినిమాలో తాను విల‌న్‌ గా మాత్ర‌మే న‌టిస్తున్న‌ట్లు వెల్లడించారు. అలా ఇప్పుడు నెట్టింట వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు సుహాస్.

"హలో. నా నెక్స్ట్ మూవీ కోలీవుడ్ సినిమా మండాడి గురించి చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. అయితే తెలుగు వెర్ష‌న్‌ లో నేను హీరోగా న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఆ వార్త‌లు నిజం కావు. నేను కేవలం విలన్ రోల్ ను పోషిస్తున్నారు. సూరి అన్నయ్య హీరోగా నటిస్తున్నారు" అంటూ సుహాస్ పోస్ట్ పెట్టారు.

ఇక మండాడి మూవీ విషయానికొస్తే.. మహిమా నంబియార్ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. సత్యరాజ్, అచ్యుత్ కుమార్, స‌చ్చనా న‌మిదాస్‌, ర‌వీంద్ర విజ‌య్ తదితరులు కీలక పాత్రల్లో సందడి చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.