Begin typing your search above and press return to search.

హే బ‌ల‌వంత్: ఆడియన్స్ కు మంచి పైసా వ‌సూల్ సినిమా

సుహాస్ మాట్లాడుతూ, త‌న‌ను ఎప్పుడూ ఎంక‌రేజ్ చేసే సందీప్ కిషన్‌కు థాంక్స్ చెప్పారు. ఈ మూవీ కోసం మా టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 Feb 2026 11:49 AM IST
హే బ‌ల‌వంత్: ఆడియన్స్ కు మంచి పైసా వ‌సూల్ సినిమా
X

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు సుహాస్ మరోసారి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం హే బల్‌వంత్‌ ఫిబ్రవరి 20న విడుదలకు సిద్ధమవుతోంది. టైటిల్ మార్చిన‌ తర్వాత నిర్వహించిన నాట్ ఏ టైటిల్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి హీరో సందీప్ కిష‌న్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ కు త‌న గ్రీటింగ్స్ ను తెలిపారు.

రీసెంట్ గా వరుస స‌క్సెస్‌ల‌తో గుర్తింపు తెచ్చుకున్న బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై ఈ సినిమానుప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. సుహాస్ సరసన శివానీ నాగారం కథానాయికగా నటించగా, సీనియర్ నటుడు నరేష్‌, యాంకర్ స్రవంతి చొక్కారాపు కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

ఈవెంట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ, వంశీ నందిపాటి పేరు గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తోందని, ఆయన కాన్ఫిడెన్స్ ను మెచ్చుకోవాలి అన్నారు. సుహాస్ కథను నమ్మి సినిమాలు చేసే హీరో అని, ఈ సినిమాతో మరోసారి ఆడియ‌న్స్ మనసులు గెలుస్తాడనే నమ్మకం ఉంది. టీజర్ ఆసక్తికరంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుంద‌న్నారు.

సుహాస్ మాట్లాడుతూ, త‌న‌ను ఎప్పుడూ ఎంక‌రేజ్ చేసే సందీప్ కిషన్‌కు థాంక్స్ చెప్పారు. ఈ మూవీ కోసం మా టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్ సాగర్ ఈ సినిమాను మ్యూజికల్ నైట్‌లా తీర్చిదిద్దారు. నిర్మాత ఖ‌ర్చు విష‌యంలో ఎలాంటి రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. డైరెక్ట‌ర్ గోపీ తన కలను ఈ సినిమాతో నెరవేర్చుకున్నాడ‌ని, హే బల్‌వంత్‌తో నా కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ వస్తుందని న‌మ్ముతున్నాన‌న్నారు.

శివానీ నాగారం మాట్లాడుతూ, టైటిల్ మారినప్పుడు కొంత టెన్షన్ ఉన్నా, కంటెంట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంద‌ని, ఈ సినిమా ఎమోష‌న్, ఎంట‌ర్టైన్‌మెంట్, ఫ్యామిలీ రిలేష‌న్స్.. అన్నీ క‌లిపిన ఒక ప్యాకేజ్ లా ఉంటుంద‌ని, థియేట‌ర్ల నుంచి ఆడియ‌న్స్ న‌వ్వుకుంటూ బ‌య‌ట‌కు వ‌స్తార‌ని తెలిపారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ, డేట్ మారినా, టైటిల్ మారినా ఫిబ్రవరి 20న మా సినిమా సృష్టించే ఇంపాక్ట్ మారదు. లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, తండ్రీకొడుకుల‌ ఎమోషన్ ఈ సినిమాకు బలం. ఆడియ‌న్స్ డబ్బుకు పూర్తి న్యాయం చేసే పైసా వసూల్ ఎంటర్‌టైనర్ ఇది అని న‌మ్మ‌కం వ్యక్తం చేశారు. అదే స్టేజ్ పై డైరెక్ట‌ర్ గోపీకి రెండో సినిమా అడ్వాన్స్ ఇవ్వడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేసింది.

నిర్మాత బి. నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఇరవై కథలు విన్న తరువాత గోపీ చెప్పిన కథ నచ్చి వెంటనే షూటింగ్ ను మొద‌లు పెట్టి, ఫాస్ట్ గా షూటింగ్ ను పూర్తి చేశామ‌ని, దీనికి టెక్నికల్ టీమ్, నటీనటుల సహకారం ఎంతో ఉందని చెప్పారు.

డైరెక్ట‌ర్ గోపీ అచ్చర మాట్లాడుతూ, మారింది టైటిలే కానీ కంటెంట్ కాద‌ని, ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన్మెంట్ తో పాటూ హృదయాన్ని తాకే ఎమోష‌న్ ఉంటుంద‌ని స్పష్టం చేశారు.

మొత్తానికి హాస్యం, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా సమ్మేళనంగా తెరకెక్కిన హే బల్‌వంత్‌పై చిత్ర యూనిట్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఫిబ్రవరి 20న ఆడియ‌న్స్ ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.