Begin typing your search above and press return to search.

డ్రీమ్‌గ‌ర్ల్ 2: రిలీజ్ ముందే రివ్యూ చెప్పేసిన న‌ట‌వార‌సురాలు

సుహానా PVR ప్రివ్యూ థియేట‌ర్ నుండి బయటకు వ‌స్తూ ఉండ‌గా మీడియా వెంట‌ప‌డింది. సుహానా అందంగా నవ్వుతూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చింది.

By:  Tupaki Desk   |   26 Aug 2023 3:56 AM GMT
డ్రీమ్‌గ‌ర్ల్ 2: రిలీజ్ ముందే రివ్యూ చెప్పేసిన న‌ట‌వార‌సురాలు
X

ఆయుష్మాన్ ఖురానా న‌టించిన 'డ్రీమ్ గర్ల్ 2' ఈ శుక్ర‌వారం విడుదలైంది. బ్లాక్ బ‌స్ట‌ర్ 'డ్రీమ్ గ‌ర్ల్' చిత్రానికి ఇది సీక్వెల్. అయితే ఒక‌రోజు ముందే ప్రివ్యూ వీక్షించిన న‌ట‌వార‌సురాలు సుహానా ఖాన్ డ్రీమ్ గ‌ర్ల్ 2పై రివ్యూ చెప్పేసింది. ఈ సినిమా త‌న‌ను బాగా ఆకట్టుకుంద‌ని ఎక్స్ ప్రెష‌న్స్ తోనే క్యూట్ గా వెల్ల‌డించింది. వర్ధమాన నటి సుహానా ఈ చిత్రానికి థంబ్స్-అప్ ఇచ్చింది. ఆస‌క్తిక‌రంగా ఈ సినిమాలో త‌న స్నేహితురాలు అన‌న్య పాండే క‌థానాయిక‌. ఇక సుహానా ఖాన్ రివ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం డ్రీమ్ గర్ల్ 2 స్క్రీనింగ్‌లో సుహానా త‌న స్నేహితురాళ్లు షానయ - నవ్య న‌వేళితో క‌లిసి కనిపించింది. మూవీ వీక్షించిన అనంత‌రం ఫ్రెండ్స్ అంతా మీడియాకు రివ్యూలు చెప్పారు.

సుహానా PVR ప్రివ్యూ థియేట‌ర్ నుండి బయటకు వ‌స్తూ ఉండ‌గా మీడియా వెంట‌ప‌డింది. సుహానా అందంగా నవ్వుతూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చింది. 'బాహోత్ అచే' అంటూ సినిమాని స‌మీక్షించింది. ఈ సినిమా త‌న‌కు బాగా న‌చ్చింద‌ని తెలిపింది. అయితే ఈ కామెడీ ఎంటర్‌టైనర్ గురించి ఇత‌ర విష‌యాలేవీ సుహానా వెల్లడించలేదు. డ్రీమ్ గర్ల్ 2 స్క్రీనింగ్‌లో ఆదిత్య రాయ్ కపూర్ కూడా కనిపించారు. ఆదిత్య - అనన్య డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు ఉన్నాయి కానీ ఇద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. సుహానా విషయానికి వస్తే.. జోయా అక్తర్ 'ది ఆర్చీస్‌'తో తన అరంగేట్రానికి సిద్ధంగా ఉంది. ఇందులో సుహానా, జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాల ఈ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేస్తున్నారు.

'డ్రీమ్ గర్ల్ 2 చిత్రానికి రాజ్ శాండిల్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఏక్తా ఆర్ కపూర్ - శోభా కపూర్ నిర్మించారు, ఆయుష్మాన్ ఖురానా - అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించగా, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ, సీమా పహ్వా, విజయ్ రాజ్, మంజోత్ సింగ్, అభిషేక్ బెనర్జీ , రంజన్ రాజ్, మనోజ్ జోషి, మరియు అన్నూ కపూర్ ప్రముఖ పాత్రలలో న‌టించారు. అమ్మాయిగా మారి ఆక‌తాయిల‌తో ఆడుకునే (మోసం చేసే) అబ్బాయిగా ఆయుష్మాన్ ఈ చిత్రంలో న‌టించాడు. ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. డ్రీమ్ గ‌ర్ల్ 2 పై హిందీ క్రిటిక్స్ ఏమ‌ని స‌మీక్షించారో చూడాలి.