Begin typing your search above and press return to search.

ఉల్లి పొర‌లాంటి వైట్ లో సుహానా వేడి!

తాజాగా అమ్మ‌డు మ‌రోసారి చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగింది. ఇదిగో ఇక్క‌డిలా తెలుపు రంగు ఉల్లిపోర లాంటి దుస్తుల్లో కాక పుట్టించే ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది.

By:  Tupaki Desk   |   26 April 2024 8:24 AM GMT
ఉల్లి పొర‌లాంటి వైట్ లో సుహానా వేడి!
X

బాలీవుడ్ స్టార్ కిడ్ సుహానాఖాన్ టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వీకెండ్ పార్టీల్లో అమ్మ‌డు ప‌బ్ ల్లో ఏ రేంజ్ లో వైర‌ల్ అవుతుందో తెలిసిందే. చిట్టిపొట్టి దుస్తుల్లో కుర్ర‌కారులో వేడి పుట్టిస్తుంటుంది. 'ది అర్చిస్' కంటే ముందే సుహానా ఆ ర‌క‌మైన ఫోజుల‌తో బోలెడంత ఫ్యాన్ బేస్ సంపాదించింది. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగింది. ఇదిగో ఇక్క‌డిలా తెలుపు రంగు ఉల్లిపోర లాంటి దుస్తుల్లో కాక పుట్టించే ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది.

న్యూ ఫోటో షూట్ లో భాగంగా ఇలా నెట్టింట చ‌ర్చకొచ్చింది. మ‌త్తెక్కించే చూపుల‌తో సుహానా లాక్ చేసేస్తోంది. అమ్మ‌డు ఎంపిక చేసుకున్న భంగిమ అంతే హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. సుహానా అభిమానులు ఘాటు ఫోజుకి ఫిదా అవుతున్నారు. త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పించి అభిమానం కురిపిస్తున్నారు. ఇక సుహానాఖాన్ కి స్టార్ హీరోయిన్ చేయాలని డాడ్ షారుక్ ఖాన్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

'కింగ్' అనే సినిమాతో లాంచ్ అవుతుంది. సుజోయ్ ఘోష్ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.హై ఆక్టేన్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షారుక్ ఖాన్ త‌న స్టార్ డ‌మ్ ని సైతం ప‌క్క‌న‌బెట్టి కుమార్తె కోసం ప‌నిచేస్తున్నాడు. కుమార్తెకి గురువు పాత్ర పోషిస్తున్నాడు. ఆ ర‌కంగా తండ్రీ కుమార్తెలిద్ద‌రు తొలి సినిమాతోనే గురు శిష్యుల‌వుతున్నారు. ఈ సినిమా బ‌డ్జెట్ = 200 కోట్ల‌కు పైగానే వెచ్చిస్తున్న‌ట్ల బాలీవుడ్ లో మీడియాలో ప్ర‌చారం సాగుతుంది.

క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని ది బెస్ట్ టీమ్ అంతా సినిమాకి ప‌నిచేసేలా చూడాల‌ని సుజోయ్ ఆదేశించాడు. ప్ర‌స్తుతం షారుక్ ఖాన్ కుమార్తె ఎంట్రీ ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు. మ‌రోవైపు సుహానాఖాన్ అవ‌స‌ర‌మైన ట్రైనింగ్ లు కూడా పూర్తి చేస్తుంది. ఇప్ప‌టికే సుహానా ది అర్చీస్ తో తొలిసారి కెమారా ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే సిరీస్ తో చాలా మంది బాలీవుడ్ నేప‌థ్య‌మున్న స్టార్ కిడ్స్ ప‌రిచ‌మ‌య్యారు. దీంతో ఆసిరీస్ గుంపులో గోవింద అన్న‌ట్లు హైలైట్ అయింది.