Begin typing your search above and press return to search.

భార‌త‌దేశంలో మోస్ట్ డేట‌బుల్ యాక్ట‌ర్?

అదంతా అటుంచితే అన‌న్య పాండే తాజాగా సుహానాకు అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చింది. బాలీవుడ్‌లో సుహానా ఖాన్‌ను 'మోస్ట్ డేటబుల్ యాక్టర్' అని వ్యాఖ్యానించింది.

By:  Tupaki Desk   |   30 March 2024 2:45 AM GMT
భార‌త‌దేశంలో మోస్ట్ డేట‌బుల్ యాక్ట‌ర్?
X

అన‌న్య పాండే- సుహానా ఖాన్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే. స్టార్ కిడ్స్ ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేరు. ఇంత‌కుముందు సుహానా లండ‌న్ లో చ‌దువుకున్న‌ప్పుడు కూడా అన‌న్య త‌ర‌చుగా త‌న స్నేహితురాలిని క‌లిసేది. బాలీవుడ్ లో ఈవెంట్లకు ఈ జోడీ క‌లిసే వెళుతుంటారు. ఇక క్ల‌బ్ ప‌బ్ లో కామ‌న్ స్నేహాల‌కు కొద‌వేమీ లేదు. ఇరువురు న‌ట‌వార‌సురాళ్లు త‌మ సినీ ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభించారు. నిరంతరం మీడియాలో బోలెడంత‌ సందడి చేస్తున్నారు. అనన్య 2019లో సినీరంగ ప్రవేశం చేయగా, సుహానా 2023లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అదంతా అటుంచితే అన‌న్య పాండే తాజాగా సుహానాకు అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చింది. బాలీవుడ్‌లో సుహానా ఖాన్‌ను 'మోస్ట్ డేటబుల్ యాక్టర్' అని వ్యాఖ్యానించింది. నో ఫిల్టర్ నేహా టాక్ షోలో నేహా ధూపియాతో ఇంటర్వ్యూలో అనన్య పైవిధంగా ఆకాశానికెత్తేసింది. సుహానా ఖాన్‌ను ఎప్పటికీ ఉత్తమ స్నేహితురాలుగా ప్రకటించిన అన‌న్య .. బాలీవుడ్ అవార్డ్‌లో ఎవరికి బెస్ట్ డేటింగ్ స్టార్ అవార్డ్ ఇవ్వ‌గ‌లం? అని ప్ర‌శ్నించ‌గా..'సుహానా' అంటూ త‌డుముకోకుండా చెప్పేసింది.

గ‌త‌ ఇంటర్వ్యూలో సుహానా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించడంతో త‌మ మ‌ధ్య‌ పోటీ పెరుగుతుందని అన‌న్య అంగీకరించింది. ఈ పోటీ స్పూర్తిదాయకంగా ఉంటుంద‌ని కూడా అంది. తామంతా మరింత కష్టపడి పని చేయడానికి ఈ పోటీ పురికొల్పుతుందని అభిప్రాయ‌ప‌డింది. నేను అభద్రతా భావాన్ని అనుభవించను.. నేను పోటీగా మాత్ర‌మే భావిస్తున్నాను. నేను ఎప్పుడూ పోటీ త‌త్వంతోనే ఉన్నాను. ఆరోగ్యకరమైన పోటీని కలిగి ఉండటం మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. మరింత కష్టపడి పనిచేయాలనిపిస్తుంది. కొత్త టాలెంట్ వచ్చినప్పుడల్లా ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మంచి పని ఏమిటో మీరు చూడవచ్చు.. ప్రజల నుండి నేర్చుకుంటారు''అని అన‌న్య అంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... అనన్య పాండే వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. వరుణ్ ధావన్ - వీర్ దాస్‌లతో కలిసి 'కాల్ మీ బే' అనే టీవీ సిరీస్‌లో కనిపించనుంది. చిత్ర‌కథాంశం ఒక బిలియనీర్ ఫ్యాషనిష్ఠా చుట్టూ తిరుగుతుంది. అత్యంత సంపన్న కుటుంబంచే తిరస్కరించబడిన వివాదాస్ప‌ద వ్య‌క్తి... ఆ త‌ర్వాత‌ స్వతంత్రంగా జీవితాన్ని ర‌న్ చేస్తుంది. కంట్రోల్, బ్యాటిల్ నీ సీడ్స్, దర్బాదర్, శంకర, ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సి శంకరన్ నాయర్, రన్ ఫర్ యంగ్ వంటి ప్రాజెక్ట్‌లలో అన‌న్య న‌టిస్తోంది.

మరోవైపు సుహానా ఖాన్ జోయా అక్తర్ 'ది ఆర్చీస్‌'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్‌లను ఇంకా ప్రకటించలేదు.