Begin typing your search above and press return to search.

కోట్ల‌లో కొల్లగొడుతున్న స్టార్ డాట‌ర్

త‌న తండ్రి కింగ్ ఖాన్ అడుగుజాడలను అనుసరిస్తూ సుహానా తన వృత్తిపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంది.

By:  Tupaki Desk   |   10 July 2024 2:45 AM GMT
కోట్ల‌లో కొల్లగొడుతున్న స్టార్ డాట‌ర్
X

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ - గౌరీ ఖాన్ దంప‌తుల‌ కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్‌లో లేటెస్ట్ సెన్సేషన్. తన చిరునవ్వు అద్భుతమైన లుక్‌తో హృద‌యాల‌ను దోచుకుంటోంది ఈ బ్యూటీ. జోయా అక్తర్ చిత్రం ది ఆర్చీస్‌లో తన నటనతో సుహానా ల‌క్ష‌లాది మంది హృదయాలను దోచుకుంది. త‌న తండ్రి కింగ్ ఖాన్ అడుగుజాడలను అనుసరిస్తూ సుహానా తన వృత్తిపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంది.

చిన్నతనం నుండి ఖాన్ న‌టవార‌సురాలిగా బోలెడంత ఫాలోయింగ్ ని ఆస్వాధించింది. ఎదిగాక కూడా స్టార్ కావాల‌నే మార్గాన్ని ఎంచుకుంది. ప్ర‌స్తుతం న‌టిగా తన తల్లిదండ్రులను గర్వపడేలా చేయడానికి తన వంతు కృషి చేస్తోంది. కేవలం ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న సుహానా న‌టిగాను దూసుకుపోతోంది.

సుహానా ఇప్పటికే ప‌లు టాప్ బ్రాండ్‌లకు అంబాసిడ‌ర్ గా ప‌ని చేస్తోంది. కొన్ని ఆసక్తికరమైన సినిమాల్లోను న‌టిస్తూ బిజీగా ఉంది. కేవలం 24 సంవత్సరాల వయస్సులో సుహానా నికర ఆస్తి విలువ ఎంతో తెలిస్తే షాక్ ఇస్తుంది. ఈ బ్యూటీ ఇప్ప‌టికే ముంబైలోని అనేక ప్రాప‌ర్టీస్‌లో పెట్టుబడి పెట్టిందని స‌మాచారం ఉంది. ఈ మొత్తం ఆదాయం కోట్ల‌లో ఉంది. ఓవారాల్ గా త‌న సొంత ఫామ్ హౌస్ స‌హా ప‌లు ర‌కాల పెట్టుబ‌డులు పెట్టిన సుహానా స్వ‌యంగా 13 కోట్లు ఆర్జించింద‌ని స‌మాచారం. తాజాగా ప్ర‌ఖ్యాత న్యూయార్క్ కి చెందిన బ్రాండెడ్ సౌంద‌ర్య సాధ‌నాల సంస్థ‌తో భారీ కాంట్రాక్టు ను కుదుర్చుకున్న సుహానా ఈ డీల్ రూపంలో కోట్లు అందుకుంటోంద‌ని స‌మాచారం.

సుహానా ఖాన్ స్కూల్ - కాలేజీ ఫీజులు

ఇతర సెలబ్రిటీల‌ లానే సుహానా ఖాన్ కూడా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. తన పాఠశాల విద్య తర్వాత, సుహానా ఆర్డింగ్లీ కళాశాల నుండి పట్టభద్రురాలైంది. తరువాత న్యూయార్క్ యూనివర్శిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరింది. ప‌లు క‌థ‌నాల‌ ప్రకారం కళాశాల బోర్డింగ్ రుసుము ఒక్కో టర్మ్‌కు 14,000 పౌండ్‌లు. ఇది INRలో దాదాపు రూ. 14,51,177.