Begin typing your search above and press return to search.

వీడియో: స్టార్ హీరో కుమార్తె డేటింగ్ ప్రూఫ్ ఇదిగో

హిందీ మీడియా షేర్ చేసిన వీడియోలో మనీష్ పార్టీ తర్వాత అగస్త్య త‌న స్నేహితురాలు సుహానా ఖాన్‌తో క‌లిసి కార్ వ‌ర‌కూ వెళ్లడం కనిపించింది

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:46 PM GMT
వీడియో: స్టార్ హీరో కుమార్తె డేటింగ్ ప్రూఫ్ ఇదిగో
X

అగస్త్య నందా - సుహానా ఖాన్ మ‌ధ్య ఏదో జ‌రుగుతోంది. అది డేటింగ్ అయి ఉంటుంది! అంటూ ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ మీడియా అల్లుతున్న క‌థ‌నాలు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. జోయా అక్త‌ర్ 'ది ఆర్చీస్' వెబ్ సిరీస్ తో న‌టులుగా ప‌రిచ‌యం అవుతున్న ఖాన్ డాట‌ర్ సుహానా- అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వడు అగ‌స్త్య సెట్లో ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో ప‌డ్డార‌ని ప్ర‌చారం సాగింది. ఈ జంట ఒక‌రిని వీడి ఒక‌రు ఉండ‌లేరన్నదే ఈ ప్ర‌చారం సారాంశం.

ఇప్పుడు 'ది ఆర్చీస్' తార‌లు పాపుల‌ర్ డిజైన‌ర్ మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీకి అటెండ‌య్యారు. ఈ ఏడాది డిసెంబర్‌లో తెరంగేట్రం చేయనున్న ఈ నటీనటులు ఈ చిత్రంలో కలిసి పనిచేయడమే కాకుండా డేటింగ్‌లో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుహానా- అగస్త్య వారి తల్లిదండ్రులు - షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, శ్వేతా బచ్చన్ - ఊహాగానాల గురించి ఇంకా వ్యాఖ్యానించనప్పటికీ తాజాగా రిలీజైన‌ వీడియో వారి డేటింగ్ పుకార్లకు ఆజ్యం పోసింది.

హిందీ మీడియా షేర్ చేసిన వీడియోలో మనీష్ పార్టీ తర్వాత అగస్త్య త‌న స్నేహితురాలు సుహానా ఖాన్‌తో క‌లిసి కార్ వ‌ర‌కూ వెళ్లడం కనిపించింది. అక్క‌డ‌ గ్లామరస్ బ్లౌజ్‌తో అందమైన ఎరుపు రంగు లెహంగా స్కర్ట్ లో సుహానా కనిపించింది. మరోవైపు అగస్త్య నలుపు రంగు కుర్తాలొ సింపుల్ గా క‌నిపించాడు. అగస్త్య సుహానా వెనుక నడుస్తుండగా త‌న‌ కారు వద్దకు వెళ్లింది. సుహానా పార్టీని విడిచిపెట్టి వెళుతుండ‌గా త‌న‌ను అగ‌స్త్య‌ సురక్షితంగా కారులో కూర్చోబెట్టారు. ఇది ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహానుబంధాన్ని మించిన బంధం అని ఊహాగానాలకు తెర తీసింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో అగస్త్య - సుహానా డేటింగ్ చేస్తున్నారని, వారి సంబంధానికి అగస్త్య తల్లి శ్వేతా బచ్చన్ నుండి ఆమోద ముద్ర లభించిందని కూడా క‌థ‌నాలొచ్చాయి. 'ది ఆర్చీస్' ప్రొడక్షన్‌కి దగ్గరగా ఉన్న ఒక సోర్స్ హిందూస్తాన్ టైమ్స్ కి కొంత లీక్ ఇచ్చిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. ''యువ‌జంట సెట్లో చాలా సమయం కలిసి గడిపేవారు. త‌మ మ‌ధ్య అనుబంధాన్ని దాచడానికి కూడా ప్రయత్నించరు. వారు దీన్ని ఇంకా అధికారికం చేయడానికి ప్లాన్ చేయనప్పటికీ ప్రొడక్షన్ హౌస్‌లోని చాలా మంది వ్యక్తులు ఆగస్టు 2022 నాటికి వారి బంధం గురించి తెలుసుకున్నారు'' అని తెలిసింది. శ్వేతా బచ్చన్ కూడా సుహానాను ప్రేమిస్తుంది. ఈ సంబంధాన్ని ఆమోదించింది! అని కూడా క‌థ‌నాలొచ్చాయి.

గత సంవత్సరం కపూర్ ఫ్యామిలీ క్రిస్మస్ బ్రంచ్‌లో అగస్త్య సుహానాను తన 'భాగస్వామి'గా పరిచయం చేశాడని కూడా సోర్స్ పేర్కొంది. అగస్త్య తన కుటుంబ సభ్యులందరికీ సుహానాను భాగస్వామిగా పరిచయం చేసాడు! అని అదే సోర్స్ తెలిపింది. జోయా అక్తర్ ప్రాజెక్ట్ 'ది ఆర్చీస్' సెట్స్‌లో సుహానా- అగస్త్య జంటగా ఉన్నారు. సుహానా- అగస్త్యతో పాటు ఈ చిత్రంలో బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషీ కపూర్, మిహిర్ అహుజా, డాట్, యువరాజ్ మెండా, వేదంగ్ రైనా కూడా నటించారు.