Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలు డైరెక్ట‌ర్ల‌కు ఫీల‌ర్లు వ‌దిలిందా?

సుహానా ఎరుపు రంగు దుస్తులలో తన అభిమానులను ఆకర్షించింది. రెడ్ క‌ల‌ర్ దుస్తుల‌లో సుహానా మ‌త్స్య‌క‌న్య‌ను త‌ల‌పించింది

By:  Tupaki Desk   |   20 Dec 2023 1:55 PM GMT
స్టార్ హీరోలు డైరెక్ట‌ర్ల‌కు ఫీల‌ర్లు వ‌దిలిందా?
X

కింగ్ ఖాన్ షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ 'ది ఆర్చీస్'తో ఓటీటీలోకి ప్రవేశించింది. ఇది నెట్ ఫ్లిక్స్ సిరీస్. జోయా అక్త‌ర్ తెర‌కెక్కించిన ఈ సిరీస్ కి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ సిరీస్ తో న‌లుగురు డెబ్యూ న‌టులు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. వీరంతా ఇక‌పై పెద్ద తెర ఎంట్రీ కోసం ఆత్రంగా ఉన్నారు. సుహానాఖాన్ త‌దుప‌రి త‌న తండ్రి షారూఖ్ తో క‌లిసి ఒక భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టించ‌నుంది.


'ది ఆర్చీస్' లో సుహానా న‌ట‌న‌కు అభిమానుల నుంచి ప్ర‌శంస‌లు కురిసిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సినిమానే అయినా ఖాన్ డాట‌ర్ అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇంత‌లోనే సుహానా త‌న క్రేజ్ ను పెంచుకునేందుకు సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ గ్లామ్ కంటెంట్ తో విరుచుకుప‌డుతోంది. తాను ఒక స్ట‌న్నింగ్ హీరోయిన్‌కి త‌క్కువేమీ కాద‌ని, త‌న‌లో గ్లామ‌ర్ యాంగిల్ ని సుహానా ప్ర‌ద‌ర్శిస్తోంది. త‌న అంద‌చందాల‌కు త‌గినట్టుగానే కాంబినేష‌న్ పింక్ లిప్ స్టిక్, ఫ్రీ హెయిర్ స్టైల్ తో సుహానా ఎంతో అందంగా క‌నిపించింది.


సుహానా ఎరుపు రంగు దుస్తులలో తన అభిమానులను ఆకర్షించింది. రెడ్ క‌ల‌ర్ దుస్తుల‌లో సుహానా మ‌త్స్య‌క‌న్య‌ను త‌ల‌పించింది. ముఖ్యంగా మిరుమిట్లు గొలిపే క్రిస్ట‌లైన్ టాప్ లో అందాల ఎలివేష‌న్ లో సుహానా ఎక్క‌డా తగ్గ‌లేదు. సుహానా మారిన లుక్ మేకోవ‌ర్ చూస్తుంటే స్టార్ హీరోలు, స్టార్ డైరెక్ట‌ర్ల‌కు ఫీల‌ర్లు వ‌దులుతోందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌దుప‌రి ఖాన్ లెగ‌సీని ముందుకు తీసుకెళుతుంద‌ని అభిమానులు భావిస్తున్న ఈ స‌మ‌యంలో సుహానా ప్లానింగ్ ఆస‌క్తిగా మారింది.