Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రెక్క‌లు విచ్చిన‌ సీతా కోక చిలుక

ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో న‌టిగా ఆరంగేట్రం చేస్తోంది సుహానా ఖాన్. కింగ్ ఖాన్ షారూఖ్ న‌ట‌వార‌సురాలిగా రంగ ప్ర‌వేశం చేస్తున్న సుహానాపైనే అంద‌రి క‌ళ్లు

By:  Tupaki Desk   |   29 Nov 2023 12:16 PM GMT
ఫోటో స్టోరి: రెక్క‌లు విచ్చిన‌ సీతా కోక చిలుక
X

ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో న‌టిగా ఆరంగేట్రం చేస్తోంది సుహానా ఖాన్. కింగ్ ఖాన్ షారూఖ్ న‌ట‌వార‌సురాలిగా రంగ ప్ర‌వేశం చేస్తున్న సుహానాపైనే అంద‌రి క‌ళ్లు. త‌న తొలి సినిమాలో ఎలా న‌టిస్తుందో చూడాల‌ని అంద‌రిలో ఆస‌క్తి. ఇప్ప‌టికే ది ఆర్చీస్ నుంచి టీజ‌ర్, ట్రైల‌ర్, పాట‌లు స‌హా ప్ర‌తిదీ వెబ్ లో దూసుకెళ్లాయి. వీటికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ట్రైల‌ర్ లో సుహానా రెట్రో స్టైల్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు.


ఇటీవ‌ల ది ఆర్చీస్ ని ప్ర‌మోట్ చేస్తున్న సుహానా ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. తాజా ఫోటోషూట్ లో సుహానా బ‌ట‌ర్ ఫ్లై లుక్ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. మిరుమిట్లు గొలిపే ఫ్లోర‌ల్ మిడీ త‌ర‌హా డిజైన‌ర్ డ్రెస్ లో సుహానా ఎంతో ల‌వ్ లీ గా క‌నిపిస్తోంది. మేక‌ప్ జిగ్ జాగ్ అంత‌గా డామినేట్ చేయ‌కుండా ఎంతో డీసెంట్ గాను ఈ డిజైన‌ర్ లుక్ క‌నిపిస్తోంది. రెక్క‌లు విచ్చిన‌ సీతాకోక చిలుక అంత అందంగా ఉంద‌ని పొగిడేస్తున్నారు. షారూఖ్ కుమార్తె ఎలివేష‌న్ స్పెష‌ల్ గా ఉందంటూ అంతా ప్ర‌శంసిస్తున్నారు.


గాయ‌నిగా సుహానా:

ది ఆర్చీస్ తో సుహానా న‌టిగానే కాదు గాయ‌నిగాను ప‌రిచ‌య‌మ‌వుతోంది. కొత్తగా విడుదల చేసిన సినిమా పాట 'జబ్ తుమ్ నా థీన్' పాట‌ను తొలిసారిగా పాడింది. జోయా అక్తర్ లైవ్-యాక్షన్ మ్యూజికల్ 'ది ఆర్చీస్' కోసం సుహానా స్వ‌యంగా పాట పాడటం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ పాటలో డాట్, జావేద్ అక్తర్, శంకర్-ఎహసాన్-లాయ్, తేజస్‌ సహా ఇతర కళాకారుల సహకారం కూడా ఉంది.

సోషల్ మీడియాలో సుహానా ఖాన్ త‌న స‌హ‌చ‌రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. జోయా అక్తర్ - శంకర్ మహదేవన్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ హృదయపూర్వక పోస్ట్‌ను షేర్ చేసింది. నా మొదటి పాట నేను పాడాను!! నాతో చాలా ఓపికగా ఉన్నందుకు @zoieakhtar & @shankar.mahadevan ధన్యవాదాలు. దయ చేసి వినండి అని ఎక్స్ లో పేర్కొంది. న‌టించిన తొలి చిత్రంతోనే గాయ‌నిగాను సుహానా రంగ ప్ర‌వేశం చేయ‌డంపై అభిమానుల్లో నిరీక్షణను మరింత పెంచింది. ది ఆర్చీస్ ఈ సంవత్సరంలో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా నిలిచింది.

1960ల నాటి ఇడిలిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన మ్యూజిక‌ల్ డ్రామా 'ది ఆర్చీస్' నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. టైగర్ బేబీ, ఆర్చీ కామిక్స్, గ్రాఫిక్ ఇండియా స‌మ‌ర్ప‌ణ‌ స‌హ‌కారంతో జోయా అక్తర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం 7 డిసెంబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లోకి విడుద‌ల‌వుతుంది. ది ఆర్చీస్ సహనటులు డాట్ (అదితి), అగస్త్య నందా, ఖుషీ కపూర్, మిహిర్ అహుజా, వేదంగ్ రైనా, యువరాజ్ మెండా కీలక పాత్రల్లో నటించారు.