Begin typing your search above and press return to search.

కింగ్ వార‌సురాలిపై మెంటార్ గుడ్డి న‌మ్మ‌కం?

ఇంకా ఒక‌టో సినిమా అయినా విడుద‌ల కాలేదు... కానీ సుహానా ఖాన్ పెద్ద స్టార్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని అన్నాడు క‌ర‌ణ్ జోహార్.

By:  Tupaki Desk   |   9 May 2025 3:45 AM
కింగ్ వార‌సురాలిపై మెంటార్ గుడ్డి న‌మ్మ‌కం?
X

ఇంకా ఒక‌టో సినిమా అయినా విడుద‌ల కాలేదు... కానీ సుహానా ఖాన్ పెద్ద స్టార్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని అన్నాడు క‌ర‌ణ్ జోహార్. కింగ్ ఖాన్ షారూఖ్ కి అత్యంత స‌న్నిహితుడిగా అత‌డికి సుహానాపై అపార‌మైన న‌మ్మ‌కం ఉండ‌టం స‌హ‌జ‌మ‌ని అంతా భావించి ఉండొచ్చు. కానీ అత‌డు సుహానాను చాలా కాలంగా స‌న్నిహితంగా చూస్తున్నాన‌ని, త‌న పాఠశాల రోజుల నుంచి త‌న ప్ర‌త‌భ‌ను గ‌మ‌నించాన‌ని, ఆమె తన కళలో చేసిన‌ కృషిని చూశానని క‌ర‌ణ్ అన్నారు. ప్రజలు సుహానాను ది కింగ్‌లో తన తండ్రితో చూసినప్పుడు... పెద్ద అంచ‌నాల‌తో చూస్తారు.. అద్భుత ప్ర‌తిభావంతురాలు అని గుర్తిస్తారు. సుహానా అద్భుతంగా రాణించబోతోంది. ఆమె నా కుమార్తె లాంటిది కాబట్టి నేను ఇలా చెప్పడం లేదు. సుహానా ఖాన్‌లో ఒక గొప్ప, దృఢమైన కళాకారిణి ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇలా చెబుతున్నాను.. అని అన్నారు.

నేపో కిడ్స్ ని మాత్ర‌మే కాదు.. చాలామంది కొత్త వారిని తాను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసాన‌ని, కానీ కొత్త‌వారిని ప‌రిచ‌యం చేసినా త‌న‌కు క్రెడిట్ ద‌క్క‌లేద‌ని క‌ర‌ణ్ గుర్తు చేసుకున్నారు. నేటిత‌రం న‌టీన‌టుల్లో ఎవరు ఉత్త‌మంగా రాణిస్తున్నారు? అని ప్ర‌శ్నించ‌గా, ``ఆదర్శ్ గౌరవ్ - షనాయ కపూర్ ల సినిమా ట్రైలర్ ఇటీవలే చూశాను. అది చాలా బాగుంది. లక్ష్య ఒక అద్భుతమైన ప్రతిభ కలిగిన న‌టుడు అని నేను అనుకుంటున్నాను. అతనికి గొప్ప స్టార్ అయ్యే సామర్థ్యం ఉంది. రాఘవ్ జుయల్ `కిల్` లో అద్భుతమైన నటన కనబరిచాడు. నాకు అగస్త్య నంద , వేదంగ్ రైనాలు ఇష్టం`` అని ఆయన అన్నారు.

తన కంపెనీ చాలా సంవత్సరాలుగా ఔట్ సైడ‌ర్స్ ని కూడా ప‌రిచ‌యం చేసింద‌ని కానీ దానికి గుర్తింపు ద‌క్క‌లేద‌ని కూడా అన్నారు. అయితే ఔట్ సైడ‌ర్ కార్తీక్ ఆర్య‌న్ తో క‌ర‌ణ్ క‌ల‌త‌ల గురించి తెలిసిందే. దోస్తానా 2లో ఔట్ సైడ‌ర్ కార్తీక్ ఆర్య‌న్ కి అవ‌కాశం క‌ల్పించినా తిరిగి ఆ సినిమాని క‌ర‌ణ్ నిర్వీర్యం చేసాడు. ప‌రిశ్ర‌మ‌లోని ప‌లువురు కొత్త వారిని ప‌రిచ‌యం చేసేందుకు అత‌డు భారీ ప్రాణాళిక‌ల్ని ర‌చిస్తాడ‌ని ఆశిద్దాం.