కూతురిపై స్టార్ వైఫ్ ఈగ వాలనివ్వడం లేదు
షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ - సుహానా ఖాన్ ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు.
By: Tupaki Desk | 13 Jun 2025 10:35 PM ISTసెట్లో హీరోయిన్ వెంటే ఉండి జాగ్రత్త తీసుకునే మమ్మీల కథలు విన్నాం. కుమార్తెకు ఏ కష్టం వచ్చినా ప్రొటెక్షన్ అమ్మే కదా! అయితే కింగ్ ఖాన్ నటవారసురాలు సుహానా ఖాన్ కి అన్నీ తానే అయిన గౌరీఖాన్ ఇటీవలి కాలంలో మరింత రక్షణాత్మకంగా మరారు. కుమార్తె సుహానా ఖాన్ ని ఎక్కడికీ ఒంటరిగా పంపడం లేదు. అన్నిటికీ తానున్నాను అంటోంది. తనపై కనీసం ఈగ వాలనివ్వడం లేదు. ఇదిగో ఇప్పుడు సుహానా ఖాన్ వెంట పడి మరీ ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాపర్లు ఖంగు తిన్నారు. గౌరీఖాన్ తన కుమార్తె ఫోటోలు తీయొద్దంటూ గరంగరంగా కనిపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ - సుహానా ఖాన్ ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. ఈ తల్లి కూతురు జోడీ స్టైల్ ఐకన్స్ ని తలపించారు. సుహానా ఆదమరిచి అలా విమానాశ్రయంలో నడుచుకుంటూ వస్తుంటే, అసలు ఫోటోలు తీయొద్దు ప్లీజ్! అంటూ గౌరీఖాన్ ఫోటోగ్రాఫర్లను వారించేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో సుహానా తల దించుకుని వేగంగా నడుస్తూ వెళుతోంది. సుహానా సింపుల్ గా డెనిమ్ డఫెల్ ఫ్యాంట్, బ్లాక్ టీషర్ట్ ధరించగా, గౌరీ కూడా డఫెల్ థై స్లిట్ డెనిమ్స్ లో టూమచ్ ఫ్యాషనిస్టా లుక్ తో ఆశ్చర్యపరిచింది. కింగ్ ఖాన్ నటవారసురాలు సింపుల్ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది.
సుహానా డిసెంబర్ 2023లో జోయా అక్తర్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ `ది ఆర్చీస్`తో నటనా రంగ ప్రవేశం చేసింది. ఈ వెబ్ సిరీస్ లో ఖుషీ కపూర్, అగస్త్య నందా, డాట్, మిహిర్ అహుజా, వేదంగ్ రైనా, యువరాజ్ మెండా కూడా నటించారు. తరువాత సుహానా తన తండ్రితో కలిసి మోస్ట్ అవైటెడ్ `కింగ్`లో నటించనుంది. మొదట సుజోయ్ ఘోష్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనే, జైదీప్ అహ్లవత్ తదితరులు ఇందులో నటిస్తున్నారు.
