Begin typing your search above and press return to search.

వీడియో : ప్రియుడి సోదరితో స్టార్‌ కిడ్‌ వీకెండ్‌ పార్టీ

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ షారుఖ్ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్ 'ది ఆర్చీస్‌'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

By:  Tupaki Desk   |   5 April 2025 5:00 PM IST
Suhana Khan and Agastya Nanda Spark Relationship Buzz Again
X

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ షారుఖ్ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్ 'ది ఆర్చీస్‌'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 2023లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా పర్వాలేదు అన్నట్లుగా టాక్‌ సొంతం చేసుకుంది. సినిమాలో నటించిన వారందరిలోకి సుహానా ఖాన్‌కి మంచి గుర్తింపు లభించింది. ఆమె పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. రివ్యూవర్స్ సైతం ఆ సమయంలో సుహానా ఖాన్ పాత్ర గురించి, ఆమె నటన గురించి మాట్లాడుకోవడం తెలిసిందే. ది ఆర్చీస్ షూటింగ్‌ సమయంలోనే అగస్త్య నందతో సుహానా ఖాన్‌ సన్నిహిత్యం ఏర్పడింది. అగస్త్య యొక్క సోదరి నవ్య నవేలి నందాతో సుహానా ఖాన్‌కి మంచి స్నేహం ఉండటంతో.. సుహానా - అగస్త్య మధ్య బంధం మరింతగా ముందుకు వెళ్లింది అంటూ బాలీవుడ్‌ మీడియాలో టాక్‌.

గత కొన్నాళ్లుగా సుహానా ఖాన్‌, అగస్త్య నందాల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరు పార్టీలకు హాజరు అవుతూ, పబ్‌లకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. రెగ్యులర్‌గా వీరిద్దరు కలవడం బాలీవుడ్‌ మీడియాలో చూస్తూనే ఉంటాం. వీరిద్దరు కలిసి మరో సినిమా చేయాలని సైతం అనుకుంటున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం వేరు వేరు సినిమాలతో, ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న వీరిద్దరు మళ్లీ ఎప్పుడు కలుస్తారా అంటూ నెటిజన్స్‌, మీడియా వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి ప్రేమ విషయంపై ఇరు ఫ్యామిలీలోనూ చర్చలు జరుగుతున్నాయని, పెళ్లికి సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రెగ్యులర్‌గా అగస్త్యతో కనిపించే సుహానా ఖాన్‌ ఈసారి అతడి సోదరి నవ్య నవేలి నందాతో కలిసి వీకెండ్‌ పార్టీలో పాల్గొన్న వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. నవ్యతో కలిసి సుహానా ఖాన్‌ ఒకే కారులో ప్రయాణించిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీరిద్దరు సుదీర్ఘ కాలంగా మంచి స్నేహితులు అయినప్పటికీ ఈ మధ్య కాలంలో సుహానా ఖాన్‌, అగస్త్యల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో వారి స్నేహం గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ప్రియుడు అగస్త్య సోదరి నవ్యతో కలిసి సుహానా ఖాన్‌ పార్టీలకు హాజరు అవుతుంది అంటూ జాతీయ మీడియాలో ముఖ్యంగా బాలీవుడ్‌ సోషల్‌ మీడియా పేజీల్లో తెగ ప్రచారం జరుగుతోంది.

గతంలోనూ సుహానా ఖాన్‌, నవ్య నవేలితో పాటు అగస్త్య కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. షారుఖ్ ఖాన్‌ నట వారసత్వంను పునికి పుచుకున్న సుహానా ఖాన్‌ బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ కావాలని ఆశ పడుతోంది. ప్రస్తుతం సోదరుడు ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్‌ను సుహానా ఖాన్‌ చేస్తున్న విషయం తెల్సిందే. మరోవైపు అగస్త్య నంద సైతం కొత్త ప్రాజెక్ట్‌కి రెడీ అయ్యాడు. అమితాబచ్చన్‌ కూతురు శ్వేత బచ్చన్‌ కుమారుడు అగస్త్య నంద కాగా, కూతురు నవ్య నవేలి నంద అనే విషయం తెల్సిందే. షారుఖ్ ఖాన్‌ కూతురు, అమితాబచ్చన్‌ మనవడు త్వరలోనే మరింత స్ట్రాంగ్‌ రిలేషన్‌లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.