Begin typing your search above and press return to search.

చిన్న హీరోకు దిష్టి తగిలేలా ఉంది.. మంచి కథలే పట్టేశాడు!

వరుస సినిమాలను కంప్లీట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. సుహాస్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయ్ రా బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   31 March 2024 6:15 AM GMT
చిన్న హీరోకు దిష్టి తగిలేలా ఉంది.. మంచి కథలే పట్టేశాడు!
X

యంగ్ హీరో సుహాస్.. ప్రస్తుతం ఈ నటుడి లైనప్ చూసి అంతా షాకవుతున్నారు. చేతిలో అరడజను సినిమాలతో నిమిషం తీరిక లేకుండా గడుపుతున్నారు. మొన్ననే ఓ మూవీతో వచ్చిన సుహాస్.. మరో రెండు నెలల్లో మూడు చిత్రాలతో సందడి చేయనున్నారు. అవి కాకుండా మరిన్ని సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. ఇంతలో ఓ భామ అయ్యో రామ‌ పేరుతో కొత్త మూవీ స్టార్ట్ చేశారు.

కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుహాస్.. ప్రస్తుతం చిన్న బడ్జెట్ సినిమాలకు క్రేజీ హీరోగా మారారు. కలర్ ఫోటోతో తొలిసారి హీరోగా కనిపించి మంచి పేరు సంపాదించుకున్నారు. హిట్-2 సినిమాలో విలన్ గా నటించి అందరినీ షాక్ ఇచ్చారు. గతేడాది రైటర్ పద్మభూషణ్ తో సూపర్ హిట్ కొట్టారు. ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించారు.

సుహాస్ నటిస్తున్న ప్రసన్న వదనం మూవీ.. వేసవి కానుకగా మే3వ తేదీన విడుదలవ్వనుంది.ఫేస్ బ్లైండ్‌ నెస్ అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి రోల్ లో సుహాస్ కనిపించనున్నారు. అంతకుముందే శ్రీరంగనీతులు సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది. మే 24వ తేదీన దిల్ రాజు బ్యానర్ లో సుహాస్ నటిస్తున్న ప్రొడక్షన్ నెం.4 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో మేకర్స్ ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.

ఇవి కాకుండా.. అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ మూవీలో కీర్తి సురేష్ తో మరో సినిమా చేయనున్నారు సుహస్. సందీప్ రెడ్డి బండ్లతో కూడా మూవీ చేయాల్సి ఉంది. కేబుల్ రెడ్డి మూవీ ఇంకా సెట్స్ పై ఉంది. నిన్న ప్రారంభమైన ఓ భామ అయ్యో రామ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమాతో రామ్ గోదాల దర్శకుడిగా పరిచయం కానున్నారు. నువ్వు నేను ఫేమ్ హీరోయిన్ అనిత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

ఈ సినిమాతో మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్... టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ మూవీతో మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు సుహాస్. వరుస సినిమాలను కంప్లీట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. సుహాస్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయ్ రా బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో చిన్న హీరోకు దిష్టి తగిలేలా ఉందని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. మరి సుహాస్... కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.