Begin typing your search above and press return to search.

సుడిగాలి వేగం తగ్గిందే..?

ఎంత టెంప్టింగ్ ఆఫర్లు వచ్చినా మళ్లీ తిరిగి స్మాల్ స్క్రీన్ మీదకు రాకూడదు అనుకుంటున్నాడు సుధీర్.

By:  Tupaki Desk   |   1 Aug 2023 6:09 AM GMT
సుడిగాలి వేగం తగ్గిందే..?
X

జబర్దస్త్ షోతో సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ జబర్దస్త్ లో తనకు వచ్చిన క్రేజ్ తో ఢీ లో కూడా టీం లీడర్ గా చేశాడు. సుధీర్ తో పాటుగా రష్మి ఉంటే అది ఎలాంటి షో అయినా రేటింగ్ కి ఢోకా లేదు అనే విధంగా క్రేజ్ తెచ్చుకున్నారు. జబర్దస్త్ కమెడియన్ గా మెప్పిస్తూ వచ్చిన సుధీర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పిస్తూ వచ్చాడు. ఇక సాఫ్ట్ వేర్ సుధీర్ తో హీరోగా ఫస్ట్ అటెంప్ట్ చేసిన సుధీర్ ఆ సినిమాతో జస్ట్ ఓకే అనిపించాడు. కమర్షియల్ గా సాఫ్ట్ వేర్ సుధీర్ పెద్దగా సక్సెస్ కాకపోయినా సరే లాస్ట్ ఇయర్ వచ్చిన గాలోడు పర్వాలేదు అనిపించుకుంది.

సుధీర్ గాలోడు ఇచ్చిన బూస్టింగ్ తో మరో సినిమా చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 3 మంకీస్ తో కూడా వచ్చినా పెద్దగా అలరించలేకపోయాడు సుధీర్. ప్రస్తుతం సుధీర్ G.O.A.T సినిమా చేస్తున్నాడు సుధీర్. విశ్వక్ సేన్ తో పాగల్ చేసిన నరేష్ కుప్పిలి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో సుధీర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సుధీర్ చేస్తున్న సినిమాల విషయంలో ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు ఎలాంటి ప్రమోషన్స్ చేయట్లేదు. దాని వల్ల సినిమాకు తగినంత బజ్ ఏర్పడట్లేదు.

ఒకానొక దశలో సుధీర్ బుల్లితెర ని వదిలి తప్పుచేశాడా అన్న టాక్ కూడా వచ్చింది. కానీ హీరోగా అవ్వాలనుకున్న తన కల నెరవేర్చుకునేందుకు మంచి సినిమాలు పడే వరకు సుధీర్ ఈ నిరీక్షణ తప్పదు. గాలోడుతో హిట్ అందుకున్న సుధీర్ రాబోతున్న G.O.A.T సినిమాతో పక్కా హిట్ కొడతాడని అంటున్నారు. ఈ సినిమా కథ కథనం కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చి హీరోగా మారిన చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు.

ఓ పక్క జబర్దస్త్ నుంచి వచ్చిన వేణు డైరెక్టర్ గా సక్సెస్ అవగా.. సుధీర్ కూడా హీరోగా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు. స్మాల్ స్క్రీన్ వరకు సుధీర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా వారు తనని హీరోగా కూడా ఎంకరేజ్ చేయాలని భావిస్తున్నాడు. అయితే స్మాల్ స్క్రీన్ పై సుధీర్ ని మిస్ అవుతున్న ఆడియన్స్ కూడా ఉన్నారు. ఎంత టెంప్టింగ్ ఆఫర్లు వచ్చినా మళ్లీ తిరిగి స్మాల్ స్క్రీన్ మీదకు రాకూడదు అనుకుంటున్నాడు సుధీర్.