Begin typing your search above and press return to search.

సుధీర్ హరోంహర.. అంచనాలు పెంచేస్తున్న అప్డేట్స్..

ఈ క్రమంలో సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న వారిని కూడా పరిచయం చేస్తున్నారు మేకర్స్.

By:  Tupaki Desk   |   25 Nov 2023 7:58 AM GMT
సుధీర్ హరోంహర.. అంచనాలు పెంచేస్తున్న అప్డేట్స్..
X

సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ ద్వారాక దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హరోం హర. సుధీర్ బాబు కెరీర్ లో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి టీజర్ అప్డేట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సెప్టెంబర్ 27న పవర్ ఆఫ్ సుబ్రమణ్యం అంటూ సుధీర్ బాబు హరోం హర టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న వారిని కూడా పరిచయం చేస్తున్నారు మేకర్స్.


సుధీర్ బాబు హరోంహర సినిమాలో అర్జున్ గౌడ శరత్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. తమ్మి రెడ్డి పాత్రలో లక్కీ లక్ష్మణ్ నటిస్తున్నారు. బసవ రెడ్డి పాత్రలో రవి కాలే నటిస్తున్నారు. సినిమాలో ఈ మూడు పాత్రలు కూడా చాలా కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. పవర్ ఆఫ్ సుబ్రమణ్యం తో సుధీర్ బాబు సినిమాపై బజ్ పెంచాలని చూస్తున్నారు.


పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా కథ 1989 బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమా కోసం సుధీర్ బాబు చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట. ఆల్రెడీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఆ యాసలోనే మాట్లాడి అదరగొట్టారు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు.


సుధీర్ బాబు చేస్తున్న సినిమాల్లో ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుంది. సినిమా మేకస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా హరోం హర సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ప్రతి సినిమాకు తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్న సుధీర్ బాబు రిజల్ట్ విషయంలో మాత్రం సంతృప్తి చెందట్లేదు. అందుకే హరోం హర సినిమాతో అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలని చూస్తున్నాడు. ఈమధ్యనే వచ్చిన మామా మశ్చీంద్ర సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సుధీర్ బాబు ఆ సినిమా ఫెయిల్యూర్ అవడంతో కాస్త నిరుత్సాహపడ్డాడు. అయితే హరోంహర విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది.

తెలుగు తెర మీద పీరియాడికల్ సినిమాలకు మంచి టైం నడుస్తుంది. సో సుధీర్ బాబు సినిమాకు కూడా ఆ లక్ ఫేవర్ చేసే ఛాన్స్ ఉందేమో చూడాలి. రిజల్ట్ ఎలా ఉన్నా సుధీర్ బాబు మాత్రం తన ప్రయత్నాన్ని మాత్రం వదలట్లేదు. హరోంహర ఫస్ట్ టీజర్ తోనే సినిమాపై మంచి బజ్ పెంచాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాపై ఫస్ట్ ఇంప్యాక్ట్ క్రియేట్ చేసే టీజర్ తోనే సినిమాపై ఒక అంచనాకు వచ్చేస్తారు ఆడియన్స్. అందుకే హరోం హర టీజర్ రిలీజ్ ముందే సినిమాపై క్రేజ్ వచ్చేలా చేస్తున్నారు.