Begin typing your search above and press return to search.

ఆ మాస్ హీరోతో సుధీర్ బాబు.. ఏంటి మ్యాటర్?

బాలీవుడ్ లో వర్షం సినిమాకి రీమేగా వచ్చిన 'బాగి' అనే సినిమాలో తన విలనిజంతో ఆకట్టుకున్నాడు సుధీర్ బాబు

By:  Tupaki Desk   |   23 Jan 2024 2:33 PM GMT
ఆ మాస్ హీరోతో సుధీర్ బాబు.. ఏంటి మ్యాటర్?
X

టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోల్లో సుధీర్ బాబు కూడా ఒకరు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి హీరోగా వచ్చిన సుధీర్ బాబు ఘట్టమనేని సపోర్ట్ తీసుకోకుండా తన టాలెంట్ తో డిఫరెంట్ జానర్ మూవీస్ చేస్తూ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా సినిమా సినిమాకి కొత్తదనం చూపిస్తూ వచ్చాడు. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కేవలం హీరోగానే కాదు విలన్ పాత్రల్లోనూ మెప్పించాడు.

బాలీవుడ్ లో వర్షం సినిమాకి రీమేగా వచ్చిన 'బాగి' అనే సినిమాలో తన విలనిజంతో ఆకట్టుకున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కి సమానంగా సిక్స్ ప్యాక్ బాడీ తో ఫైట్స్ చేసి అదరగొట్టాడు. దీంతో సినిమాలో సుధీర్ బాబు పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే సుధీర్ బాబు ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం మాస్ మహారాజా రవితేజ సినిమాలో సుధీర్ బాబు ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని టాక్ వైరల్ అవుతోంది. రవితేజ హీరోగా నటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ సుధీర్ బాబును సంప్రదించినట్లు తెలుస్తోంది. అందుకు సుధీర్ బాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

అయితే సినిమాలో సుధీర్ బాబు విలన్ పాత్ర చేస్తున్నాడా? లేక మరేదైనా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే 'మిస్టర్ బచ్చన్' సినిమాకి సుధీర్ బాబు పాత్ర మరింత ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక సుధీర్ బాబు విషయానికొస్తే.. గత ఏడాది 'మామ మష్చింద్ర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హర్షవర్ధన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ అందుకుంటున్న ఈ హీరో ప్రస్తుతం 'హరొం హర' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీ అవుతుంది.