Begin typing your search above and press return to search.

మ‌హేష్ మేనల్లుడి ఎంట్రీ ఎప్పుడో చెప్పేసారు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు..యంగ్ హీరో సుధీర్ బాబు త‌న‌యుడు చ‌రిత్ మాన‌స్ సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల ఎంత సంచ‌ల‌న‌మ‌య్యాడో తెలిసిందే

By:  Tupaki Desk   |   9 Jan 2024 11:57 AM GMT
మ‌హేష్ మేనల్లుడి ఎంట్రీ ఎప్పుడో చెప్పేసారు!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు..యంగ్ హీరో సుధీర్ బాబు త‌న‌యుడు చ‌రిత్ మాన‌స్ సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల ఎంత సంచ‌ల‌న‌మ‌య్యాడో తెలిసిందే. అచ్చంగా మేన మామ పీచ‌ర్ల‌తో చ‌రిత్ అభిమానుల్ని ఆక‌ట్టుకున్నాడు. వాకింగ్ స్టైల్..మ్యాన‌రిజ‌మ్ ప్ర‌తీది మ‌హేష్ ని దించిన‌ట్లే క‌నిపించింది. ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో! నెక్స్ట్ దిగేది చ‌రిత్ అంటూ ప్ర‌చారం మొద‌లైంది.

అందుకు త‌గ్గ‌ట్టు చ‌రిత్ తండ్రి సుధీర్ బాబు కూడా మంచి బూస్టింగ్ ఇచ్చాడు. అచ్చం మామ‌లాగే ఉంటాడంటూ మ‌రింత ఉత్సాహాన్ని నింపాడు. న‌టుడిగా మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి ముందే అన్ని ర‌కాలుగా త‌యారు చేస్తున్నాడు. మార్ష‌ల్ ఆర్స్ట్..డాన్సు..యాక్ష‌న్ లాంటివి ఇప్ప‌టి నుంచే నేర్చుకుంటున్నాడు. చ‌రిత్ లో ఆ ఫ్యాష‌న్ చూసి క‌చ్చితంగా స్టార్ అవుతాడిన తేలిపోయింది. అయితే అది ఎప్పుడు జ‌రుగుతుంది? అన్న‌ది తెలియ‌దు గానీ మహేష్ మేన‌ల్లుడు మాత్రం తెరంగేట్రం ఖాయం.

ఇప్ప‌టికే మ‌హేష్ అల్లుడిగా అశోక్ గ‌ల్లా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అత‌ను ఒక‌టి రెండు సినిమా లు చేసాడు. కానీ మ‌ళ్లీ ఎలాంటి సినిమా చేయ‌లేదు. మ‌రి అశోక్ ఇండ‌స్ట్రీలో ఉన్నాడా? ఇంకేదైనా చేస్తున్నాడా? అన్న‌ది తెలియాలి. ఇంత‌లోనే చ‌రిత్ పేరు తెర‌పైకి రావ‌డంతో టాపిక్ అంతా అత‌నివైపు ట‌ర్న్ అవుతుంది. తండ్రి కూడా హీరోనే కాబ‌ట్టి చ‌రిత్ కి అన్ని ర‌కాల స‌హకారం దొరుకుతుంది. మ‌రి చ‌రిత్ ఎంట్రీ ఇప్పుడు ఉంటుంద‌నే అంశంపైనా సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చేసాడు.

సుధీర్ బాబు తన భార్య పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. అనంతరం మీడియా చ‌రిత్ గురించి ప్ర‌శ్నించింది. దీనికి ఆయ‌న మాట్లాడుతూ..'ఎక్కడికి వెళ్లినా చరిత్ లాంచ్ గురించే అడుగు తున్నారు. ఇంకా రెండుమూడేళ్లు సమయం ఉంది. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు' అన్నారు. అలాగే చిన్న కొడుకు దర్శన్ కూడా సినిమాల్లోకి వ‌స్తాడ‌న్నారు. ద‌ర్శ‌న్ కృష్ణ గారి ఫేవరెట్ అని చెప్పుకొచ్చారు.