Begin typing your search above and press return to search.

మహేష్ మేనల్లుడు.. లుక్కుతో మామను గుర్తుచేసేలా

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఇమేజ్ తో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారి జాబితా 7 వరకు ఉంది

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:17 AM GMT
మహేష్ మేనల్లుడు.. లుక్కుతో మామను గుర్తుచేసేలా
X

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఇమేజ్ తో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారి జాబితా 7 వరకు ఉంది. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి రీసెంట్ గా తెరంగేట్రం చేసిన హీరోతో చూసుకుంటే ముగ్గురు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా రమేష్ బాబు, మహేష్ బాబు వచ్చారు. మహేష్ బాబు ఇమేజ్ తో అతని భావ సుదీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకున్నారు. ఇప్పుడు అతని వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.


రీసెంట్ గా సుదీర్ బాబు మామా మశ్చీంద్ర సినిమాలో చిన్నప్పటి సుదీర్ బాబు పాత్రలో కూడా అతను నటించాడు. కొడుకుని హీరోగా ఎంట్రీ చేయించడానికి సుదీర్ బాబు అన్ని సిద్ధం చేస్తున్నారు. దీనిపై అతను ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. సుదీర్ బాబు కొడుకు పేరు చరిత్ర మానస్. అచ్చంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పోలికతో అతను ఉండటం విశేషం. అలాగే బాడీ లాంగ్వేజ్ లో కూడా మేనమామని డిట్టో దించేశాడు.

వచ్చే ఏడాది హీరోగా చరిత్ మానస్ ఎంట్రీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. తన కొడుకు గురించి భాగా తెలియడంతో కచ్చితంగా చరిత్ మానస్ స్టార్ హీరో అవుతాడని సుదీర్ బాబు అప్పుడే ఫిక్స్ అయిపోయారు. మామా మశ్చీంద్ర మూవీ ఈవెంట్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.అచ్చం మహేష్ బాబు పోలికలు, బాడీ లాంగ్వేజ్ ఉండటంతో కచ్చితంగా సూపర్ స్టార్ అభిమానులు అతన్ని మహేష్ బాబు సినీ వారసుడిగా రిసీవ్ చేసుకుంటారు.

సుదీర్ బాబుకి దొరకని సూపర్ స్టార్ ఇమేజ్ ప్లాట్ ఫామ్ కచ్చితంగా చరిత్ మానస్ కి దొరుకుతుందని సినీ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఇప్పటికే హీరో కావడానికి కావాల్సిన, డాన్స్, యాక్షన్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్న చరిత్ మానస్ మామయ్యాలా పర్ఫెక్ట్ లుక్ కూడా మెయింటేన్ చేస్తే మరో సూపర్ స్టార్ అవుతాడని అంచనా వేస్తున్నారు.

మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి. ఇక సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు కూతురు సితార కూడా నటిగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఆమె కూడా ఈ మధ్య తరుచుగా తల్లితో కలిసి సోషల్ యాక్టివిటీస్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే సాంగ్స్ చేస్తోంది, సొంతంగా ఒక యుట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది.