Begin typing your search above and press return to search.

ఆయ‌న డైరెక్ట‌ర్ అయితే ప‌వ‌న్ సీఎం అవుతాడు!

యంగ్ హీరో సుధీర్ బాబు సుప‌రిచితుడే. న‌టుడిగా...మ‌హేష్ బావ‌గా సుదీర్ బాబు ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నాడు.

By:  Tupaki Desk   |   31 Aug 2023 7:28 AM GMT
ఆయ‌న డైరెక్ట‌ర్ అయితే ప‌వ‌న్ సీఎం అవుతాడు!
X

యంగ్ హీరో సుధీర్ బాబు సుప‌రిచితుడే. న‌టుడిగా...మ‌హేష్ బావ‌గా సుదీర్ బాబు ఇండ‌స్ట్రీలో కొన‌సాగు తున్నాడు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. చాలా కాలంగా సినిమాలు చేస్తున్నా! స‌రైన బ్రేక్ మాత్రం రావ‌డం లేదు. క‌మ‌ర్శియ‌ల్ గా స‌రైన హిట్ ఒక‌టి ప‌డితే! సుదీర్ కెరీర్ కి తిరుగుండ‌దు. బాలీవుడ్ లో `భాఘీ` త‌ర‌హా స‌క్సెస్ ఇక్క‌డా అందుకుని ఉంటే! అత‌ని ఫిట్ నెస్ కి సుదీర్ క్రేజీ స్టార్ అయిపోతాడు.

ఇప్ప‌టికే సిక్స్ ప్యాక్ స్టార్ గానూ మంచి గుర్తింపు ఉంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే! ఒక‌వేళ మీరు న‌టుడిగా కాకుండా..ఇక‌పై ద‌ర్శ‌కుడిగా సినిమాలు చేయాల్సి వ‌స్తే! అందులో మీ హీరో ఎవ‌రు? ఎలాంటి పాత్ర ఇస్తారు? అని ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు. అందులో త‌న హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని..అత‌న్ని త‌న సినిమా ద్వారా సీఎంగా చూడాల‌నుకుంటున్న‌ట్లు చెప్పాడు. దీంతో ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ప‌వ‌న్ అభిమానులు జేజేలు కొడుతున్నారు. ఇప్ప‌టికే ఏపీలో పవ‌న్ సీఎం అవ్వాలంటూఏ జ‌న‌సైనికులు శ‌క్తి వంచ‌న లేకుండా ప‌నిచేస్తున్నారు. సైనికులే నా బ‌లం అంటూ ప‌వ‌న్ కూడా ధీమాగా ఉన్నారు. క్యాడ‌ర్ బ‌ల‌హీనంగా ఉన్నా వెనుక కోట్లాది మంది అభిమానులు ఉండ‌టంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. ముఖ్య మంత్రి పద‌వి ప్రేక్ష‌కులు త‌నికిస్తే త‌ప్ప‌కుండా తీసుకుంటాన‌ని...పాల‌నలో సంచ‌ల‌న మార్పులు చేస్తాన‌ని వాగ్దానం చేసారు.

ఇది ప‌వ‌న్ రాజ‌కీయానికి సంబంధించిన అంశం. అయితే సుదీర్ బాబు పీకే ని త‌న సినిమా ద్వారా సీఎం పాత్ర ఆఫ‌ర్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.