Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు నమ్మకం చూస్తుంటే ముచ్చటేస్తోంది

తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. జాకీచాన్ అభిమానిగా ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను.

By:  Tupaki Desk   |   5 Dec 2023 7:28 AM GMT
సుధీర్ బాబు నమ్మకం చూస్తుంటే ముచ్చటేస్తోంది
X

యంగ్ హీరో సుధీర్ బాబు వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. సక్సెస్ ఫ్లాప్స్ అనే విషయాలను పట్టించుకోకుండా మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటూ, తనకు సంతృప్తిని ఇచ్చే పాత్రలను, తన ప్రతిభను ప్రేక్షకులకు చూపించే కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నాడు.

ప్రస్తుతం సుధీర్‌ బాబు హరోమ్‌ హర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు జ్ఞాన సాగర్‌ ద్వారాక దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం సుధీర్‌ బాబుతో పాటు యూనిట్‌ సభ్యులు అంతా కూడా చాలా కష్టపడుతున్నారట. యాక్షన్‌ సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు.

నిజమైన రైలులో ఏకంగా 20 రోజుల పాటు ఈ సినిమాలోని ఒక యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు. అసలైన వర్షంలో తడబడకుండా కష్టపడి సుధీర్‌ బాబు యాక్షన్‌ సన్నివేశాలను చేశాడని కూడా ఆయన తెలియజేశాడు.

తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. జాకీచాన్ అభిమానిగా ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. జాకీ చాన్ యొక్క యాక్షన్‌ సినిమాలను చూసేందుకు థియేటర్‌లకు వెళ్లిన నేను ఇప్పుడు ఆ యాక్షన్‌ సన్నివేశాల నుంచి ప్రేరణ పొంది ఈ సినిమా కోసం వర్క్ చేశాను.

ఈ సినిమా కోసం నేను చేసినట్లు జాకీచాన్ యాక్షన్ సీక్వెన్స్ లు మరే హీరో చేసి ఉండడు అని నమ్మకంగా చెబుతున్నాను. సినిమాలోని అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు మరియు ఇతర కథ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని సుధీర్ బాబు నమ్మకంగా ఉన్నాడు. హరోమ్‌ హర సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు, ఓవరాల్‌ సినిమాపై సుదీర్‌ బాబు నమ్మకం చూస్తూ ఉంటే ముచ్చటేస్తుందని కొందరు మీడియా వర్గాల వారు మరియు సోషల్‌ మీడియా జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు.