Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు.. ఎంత కష్టపడుతున్నా ఏం లాభం..

సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబడాలి అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 9:35 AM GMT
సుధీర్ బాబు.. ఎంత కష్టపడుతున్నా ఏం లాభం..
X

సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబడాలి అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కేవలం ఒక స్టైల్ లో కాకుండా వివిధ రకాల డిఫరెంట్ కథలను కూడా అతను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక పాత్ర కోసం అవసరమైతే తనను తాను చాలా రకాలుగా మార్చుకుంటున్నాడు. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా ఎప్పుడో సుదీర్ బాబు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు.

బెస్ట్ ఫిట్నెస్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకుంటున్న వారిలో సుధీర్ బాబు ఒకరు. అయితే ఎంత కష్టపడుతున్నా కూడా అందుకు తగ్గ ఫలితం అయితే అతనికి రావడం లేదు. సుధీర్ బాబు 2012 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక ఏడాదికి రెండు లేదా ఒక సినిమాతో వస్తున్నాడు. మరికొన్నిసార్లు మూడు సినిమాలు కూడా చేస్తున్నాడు. శివ మనసులో శ్రుతి అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ బాబు ఆ తర్వాత ప్రేమ కథ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఇక తర్వాత కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు.. అంటూ ఇలా సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. ఇక మొదట్లో రెండు మూడు సినిమాలు బాగానే ఆడినప్పటికీ మధ్యలో వరుసగా మరికొన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక మళ్లీ మరో నాలుగు ఏళ్ల తర్వాత సమ్మోహనం అనే సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నాడు.

ఇక ఆ తర్వాత సుధీర్ మళ్లీ ఎప్పటిలాగే డిజాస్టర్ చూస్తున్నాడు. శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్.. అనే మూడు సినిమాలు సుధీర్ బాబుకు చాలా నిరాశను కలిగించాయి. ముఖ్యంగా కొన్ని సినిమాలకు అయితే అసలు మొదటి రోజే కనీస షేర్స్ కూడా దక్కించుకోవడం లేదు. ఇక రీసెంట్ గా వచ్చిన మామ మశ్చీంద్రా సినిమా కూడా దారుణంగా దెబ్బ కొట్టింది.

ఈ సినిమాకు మొదటి రోజు అసలు ఏమంతగా షేర్ అయితే రాలేదు. అతను సెలెక్ట్ చేసుకుంటున్న కంటెంట్ డిఫరెంట్ గా ఉంది ఇక పాత్రల కోసం కష్టపడుతున్న విధానం కూడా బాగానే ఉంది. కానీ ఎక్కడో మాత్రం ఆడియన్స్ కోరుకుంటున్నా సరైన కంటెంట్ మాత్రం అతను నుంచి రావడం లేదు. అతనికి ఒక విధంగా సరైన దర్శకులు దొరకడం లేదు అని చెప్పాలి. కథల విషయంలో అతని జడ్జిమెంట్ ప్రతిసారి కూడా రివర్స్ అవుతూనే ఉంది.

ఇలా కంటిన్యూగా డిజాస్టర్ వస్తే తర్వాత సినిమా విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రయత్నం చేస్తే సినిమా అవకాశాలు అతని బ్యాగ్రౌండ్ తో ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ మార్కెట్ కోల్పోతే మాత్రం చాలా కష్టమవుతుంది. సుధీర్ తగిన కష్టానికి ఫలితం దక్కాలి అంటే మరింత లోతుగా డిఫరెంట్ కథలపై అతను ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నేటి తరం టాలెంట్ ను కూడా అతను ఉపయోగించుకోవడంలో కాస్త విఫలమవుతున్నాడు. కాబట్టి ఆ విషయంలో కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.