Begin typing your search above and press return to search.

మామ ఫోటో చూసి అల్లుడు నిర్ణ‌యాలు!

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సూప‌ర్ స్టార్ కృష్ణ అందించిన సేవ‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండియన్ హిస్టరీ లో జేమ్స్ బాండ్.. కౌబోయ్ సినిమాల ఘనత సూపర్ స్టార్ దే.

By:  Tupaki Desk   |   6 Aug 2023 3:30 PM GMT
మామ ఫోటో చూసి అల్లుడు నిర్ణ‌యాలు!
X

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సూప‌ర్ స్టార్ కృష్ణ అందించిన సేవ‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండియన్ హిస్టరీ లో జేమ్స్ బాండ్.. కౌబోయ్ సినిమాల ఘనత సూపర్ స్టార్ దే. తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికత ను తెచ్చిన కృష్ణ గారు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. హిట్ కొట్టినప్పుడే కాదు సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోతే ఆ నిర్మాతలకు మరో సినిమా చేయడం కూడా కృష్ణ గారు చేశారు.

అందుకే ఆయన్ను నిర్మాతల హీరో అంటారు.సినిమాల పరంగా పోటీ ఎలా ఉన్నా వ్యక్తిగతంగా ఆయన అందరు హీరోల తో చాలా మంచి సత్సంబంధాలు కొనసాగించారు. నీ వల్ల కాదు అన్న పనిని చేసి చూపించడం కృష్ణ గారికి అలవాటు. అలా ఎన్నోసార్లు తన సత్తా చాటారు. న‌టుడిగానే కాకుండా వ్య‌క్తిగ‌తంగా సామాజిక సేవ‌లోనూ ముందుండేవారు. ఆయ‌న సూప‌ర్ స్టార్ గా కొన‌సాగుతున్న రోజుల్లోనే త‌న‌యుడు మ‌హేష్ ని పెద్ద స్టార్ ని చేసారు. త‌న‌యుడి స్టార్ డ‌మ్ ని ఆస్వాదించిన ఓ తండ్రి.

ఇక కుమార్తెలెవ‌రూ సినిమా రంగంలో కొన‌సాగ‌లేదు. అలాగే న‌టుడు సుధీర్ బాబు కృష్ణ అల్లుడు అన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మామ కృష్ణ‌పై అల్లుడు మ‌న‌సులో మాట‌లు బుర్రిపాలెం వేదిక‌గా బ‌య‌ట పడ్డాయి. నిన్న‌టి రోజున కృష్ణ కాంస్య విగ్ర‌హాన్ని బుర్రి పాలెంలో ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సుదీర్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

కృష్ణ‌గారు త‌న‌కు మార్గ‌ద‌ర్శి అని.. త‌మ ఇంట్లో ఓ గ‌దిలో కృష్ణ చిత్రం ప‌ఠం ఉంటుంద‌ని..ఏదైనా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆ గ‌దిలోని కృష్ణ ప‌ఠం ముంద‌కెళ్లి నిల‌బ‌డి ఆ ప‌ఠాన్ని చూస్తూ నిర్ణ‌యాలు తీసుకుంటాన‌న్నారు. ఎలాంటి టెన్ష‌న్ ఉన్న ఆ ఫోటో ముందుకెళ్లి నిల‌బ‌డితే రిలాక్స్ అయిపోతాన‌ని తెలిపారు. ఇక కృష్ణ‌ని మ‌హేష్ ఎలా అరాధిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేష్ త‌న దేవుడిగా తండ్రిని చెబుతుంటారు.