Begin typing your search above and press return to search.

కొడుకు ఎంట్రీపై సుధీర్ బాబు దిమ్మతిరిగే ఎలివేషన్స్

తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సినిమాతో పాటు సుదీర్ బాబు తన కొడుకు గురించి కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

By:  Tupaki Desk   |   3 Oct 2023 1:17 PM GMT
కొడుకు ఎంట్రీపై సుధీర్ బాబు దిమ్మతిరిగే ఎలివేషన్స్
X

మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సుదీర్ బాబు. ప్రస్తుతం సుదీర్ బాబు మామా మశ్చీంద్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలలో సుదీర్ బాబు నటిస్తూ ఉండటం విశేషం. హర్షవర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 6న థియేటర్స్ లోకి వస్తోంది.

తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సినిమాతో పాటు సుదీర్ బాబు తన కొడుకు గురించి కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో చైల్డ్ ఎపిసోడ్ లో నటించినవాడు నా కొడుకు అని పరిచయం చేశాడు. కొడుకు చరిత్ మానస్ చాలా టాలెంటెడ్ అని మరో మూడేళ్ళలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడని సుదీర్ బాబు రివీల్ చేశారు.

హీరో కావడానికి కావాల్సిన అన్ని రకాల ట్రైనింగ్స్ తీసుకుంటున్నాడని తెలిపారు. సాలిడ్ గా కష్టపడుతున్నాడు. ఇలాగే హార్డ్ వర్క్ చేస్తే వాడిని ఎవరూ ఆపలేరు. మూడేళ్ళలో తుఫాన్ గ్యారెంటీ. అందరూ రెడీ అయిపోండి. కచ్చితంగా దిమ్మతిరిగిపోవడం ఖాయం అంటూ కొడుకు చరిత్ మానస్ టాలెంట్ గురించి సుదీర్ బాబు ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే మేనమామ మహేష్ బాబు పోలికలతో ఉన్న చరిత్ మానస్ ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.

బాడీ లాంగ్వేజ్ పరంగా కూడా అచ్చం మహేష్ బాబు డిట్టో దించేశాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొడుకు గురించి చెప్పిన తర్వాత మామా మశ్చీంద్ర మూవీలో లావుగా ఉన్న క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఆ క్యారెక్టర్ కోసం ప్రోస్తటిక్ మ్యాకప్ వాడటం జరిగిందని తెలిపారు. సినిమా చూసినపుడు ఒక క్యారెక్టర్ గానే దానిని చూడాలని కోరారు.

అందులో కూడా సుదీర్ బాబుని చూస్తూ లోపాలు ఎంచే ప్రయత్నం చేయొద్దని ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేసేవారిని కోరుతున్నా అని అన్నారు. కచ్చితంగా కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే క్యారెక్టర్స్ లో లోపాలు కనిపించవని, ఆ మ్యాకప్ లో ఇంటికి వెళ్తే మా మా సెక్యూరిటీ గార్డ్ కూడా నన్ను గుర్తుపట్టలేదని సుదీర్ బాబు చెప్పుకోద్దారు.