Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు కొత్త మూవీ.. పోస్టర్ తోనే కిక్కిచ్చేలా!

నేడు సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఆయనతో మూవీని అనౌన్స్ చేసింది.

By:  Tupaki Desk   |   11 May 2025 6:14 AM
సుధీర్ బాబు కొత్త మూవీ.. పోస్టర్ తోనే కిక్కిచ్చేలా!
X

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అన్ని జోనర్స్ లో మూవీస్ చేస్తున్నా.. అనుకున్నంత స్థాయిలో క్లిక్ అవ్వడం లేదు.

గత ఏడాది హరోం హర, మా నాన్న సూపర్ హీరో చిత్రాలతో సందడి చేసిన సుధీర్ బాబు.. ఇప్పుడు మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మూవీపై ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ ఉన్నాయి. తాజాగా సుధీర్ బాబు కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.

నేడు సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఆయనతో మూవీని అనౌన్స్ చేసింది. కంటెంట్ ఉన్న సినిమాలను మద్దతు ఇవ్వడంలో, భారీ స్థాయి బడ్జెట్ మూవీస్ నిర్మించడంలో పేరుగాంచిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ప్రొడక్షన్ నెంబర్ 51గా సుధీర్ మూవీని ప్రకటించింది.

ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వం వహించనున్న ఆ సినిమా పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో సుధీర్ బాబు.. చొక్కా లేకుండా.. వీపుపై గాయాలతో కనిపించారు. మృతదేహాలతో నిండిన మెట్లపై ఎక్కుతూ ఉన్నారు.

చేతిలో ఆయుధంతో హీరో ఉండగా.. ఎ బ్రోకెన్ సోల్ ఆన్ ఎ బ్రూటల్ సెలబ్రేషన్ అంటూ మేకర్స్ ఇచ్చిన ట్యాగ్ లైన్ వేరే లెవెల్ లో ఉంది. పోస్టర్ అండ్ ట్యాగ్ లైన్ తో సినిమా ఎలాంటి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానుందో క్లియర్ గా తెలుస్తోంది. పోస్టర్ అదిరిపోయిందని, కిక్కిచ్చేలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా మేకర్స్ అనౌన్స్ చేయలేదు. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటించనున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. సర్వైవల్ థ్రిల్లర్‌ గా రానున్న మూవీ కోసం సుధీర్ బాబు ఫుల్ మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.