Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు 'జటాధర'.. గూస్ బంప్స్ వచ్చేలా న్యూ సోల్

టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు.. ఇప్పుడు జటాధర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Sept 2025 3:54 PM IST
సుధీర్ బాబు జటాధర.. గూస్ బంప్స్ వచ్చేలా న్యూ సోల్
X

టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు.. ఇప్పుడు జటాధర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. ప్రభాస్ రిలీజ్ చేసిన టీజర్ సహా స్పెషల్ లుక్స్, పోస్టర్స్ క్రేజీ రెస్పాన్స్ అందుకున్నాయి.

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జటాధర మూవీని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇప్పుడు అందుకు సంబంధించిన పనులు పూర్తి చేస్తూనే.. తాజాగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.

జటాధరుడు అంటే శివుడి కాగా.. ఇప్పుడు ఓం నమః శివాయ అంటూ సాగే ఫస్ట్ ఆడియో ట్రాక్ ను గురువారం ఉదయం రిలీజ్ చేశారు. జటాధార సోల్ సంగీత ప్రయాణానికి సరైన ప్రారంభమని రాసుకొచ్చారు. జటాధార సోల్ తో శక్తి, విశ్వాసం, త్యాగం సారాన్ని అనుభవించండని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఆడియో ట్రాక్ వైరలవుతోంది.

సినిమా టైటిల్ కు తగ్గట్లుగా జటాధర సోల్.. మ్యూజిక్ లవర్స్ ను ఫిదా చేస్తోంది. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. ప్రతి బీట్ కూడా ఫుల్ ఎనర్జీతో ప్రతిధ్వనిస్తుంది. ఓం నమః శివాయ జపం నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రాజీవ్ రాజ్ సాంగ్ ను కంపోజ్.. చేసి ఆలపించారు. తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. సుధీర్ బాబుతోపాటు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషిస్తున్నారు. దివ్యా ఖోస్లా, ఇంద్ర కృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ సహా పలువురు నటీనటులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. హీరో మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్నారు. ఉమేష్ కుమార్ బన్సాల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరి జటాధర మూవీ ఎంతలా మెప్పిస్తుందో.. ఎలాంటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి.