Begin typing your search above and press return to search.

శరీరాన్ని అమ్ముకునే వాళ్లకి ఎథిక్స్ ఉంటాయ్.. కానీ వీళ్లకు లేవు..!

ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు థంబ్ నెల్స్ పెడుతూ తనని ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆయన అన్నారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 10:58 AM GMT
శరీరాన్ని అమ్ముకునే వాళ్లకి ఎథిక్స్ ఉంటాయ్.. కానీ వీళ్లకు లేవు..!
X

తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు శుభలేఖ సుధాకర్. నిన్నటితరం నటులల్లో ఆయన ఒకరు. అప్పట్లో మన సీనియర్ స్టార్ హీరోలందరితో కలిసి నటించారు ఆయన. అప్పటి స్టార్స్ కి పక్కన ఒక ఫ్రెండ్ గా చేసిన ఆయన కెరీర్ మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ తీసుకోగా మళ్లీ ఈమధ్య వరుస సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగు లో ప్రస్తుతం ఉన్న అతి కొద్దిమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో శుభలేఖ సుధాకర్ ఒకరు. రీసెంట్ గా ఆయన యాత్ర 2 లో మంచి పాత్ర చేశారు. ఆ సినిమా రిలీజ్ సందర్భంగా కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేశారు.

శుభలేఖ సుధాకర్ యూట్యూబ్ ఛానెల్స్ మీద తన అసహనాన్ని వ్యక్త పరిచారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు థంబ్ నెల్స్ పెడుతూ తనని ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆయన అన్నారు. తనకు చిరంజీవితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన నా మొదటి హీరో. బాలు గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన ఫోన్ చేశారు. అలాంటిది సుధాకర్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వని చిరంజీవి అని వీడియో చేస్తారు. యూట్యూబ్ వాళ్లు కొన్నాళ్లుగా తన గురించి తప్పుగా చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శైలజతో తను విడిపోయానని కొన్ని వీడియోలు చేశారు. అప్పటికీ మేము కలిసి ఉన్నామని చెప్పినా వినలేదు. ఒక టైం లో మా అమ్మగారే శైలజని మీ మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అప్పుడు తానే అలాంటివి ఏమి లేవని చెప్పాను. ఆ తర్వాత ఆమె నిద్రలోనే మరణించారు. ఆ టైం లో తను ఏం అనుకోవాలి..? ఈ వీడియోస్, యూట్యూబ్ ఛానెల్స్ వారికి ఇలా చేస్తే ఏం వస్తుందని సుధాకర్ అన్నారు. శుభలేఖ సుధాకర్ చనిపోయాడని వీడియో పెడతారు. తనను చంపితే వాళ్లకు ఏం వస్తుంది. అసలు వారికి తాను ఏం ద్రోహం చేశాను. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టను. అలాంటిది మీ పొట్ట నింపుకోవడం కోసం మరొకరిని ఇలా చంపడం కరెక్ట్ కాదు. ఇలా సంపాదించిన డబ్బుతో తిన్న ఆహారం ఒంటికి పడుతుందా..? ఇలాంటి వీడియోలు చేసే వారు ఇంతకు మించి వెయ్యి శాతం అనుభవిస్తారని ఆయన అన్నారు.

ఈ ప్రపంచంలో తక్కువ వృత్తి అంటే అది ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని సంపాదించడమే అని తాను అనుకుంటా.. అలాంటి వాళ్లకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. కానీ వీళ్లకు అలాంటివి ఏమీ లేవని సుధాకర్ యూట్యూబ్ ఛానెల్స్ పై ఫైర్ అయ్యారు.