Begin typing your search above and press return to search.

మహేష్ బాబు సోదరి పెళ్లి చూపులు స్పెషల్‌..!

చిన్న కూతురు ప్రియదర్శిణి భర్త హీరో సుధీర్ బాబు అనే విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   29 May 2024 5:45 PM IST
మహేష్ బాబు సోదరి పెళ్లి చూపులు స్పెషల్‌..!
X

సూపర్‌ స్టార్‌ కృష్ణ కి మొత్తం అయిదుగురు సంతానం. ఇద్దరు కొడుకులు రమేష్ బాబు మరియు మహేష్ బాబు అనే విషయం తెల్సిందే. ఇక కుమార్తెల విషయానికి వస్తే పెద్దమ్మాయి పద్మావతి, తర్వాత మంజుల, ఆ తర్వాత ప్రియదర్శిని. చిన్న కూతురు ప్రియదర్శిణి భర్త హీరో సుధీర్ బాబు అనే విషయం తెల్సిందే.


నేడు సుధీర్ బాబు, ప్రియదర్శినిల వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా సుధీర్ బాబు షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అప్పట్లో కృష్ణ బిడ్డల గురించి అసలు బయటకు విషయాలు వచ్చేవి కాదు. వారి ఫోటోలు కూడా కనీసం బయటకు వచ్చేవి కాదు.

ఇప్పుడు సోషల్‌ మీడియా పుణ్యమా అని కృష్ణ కూతురు ప్రియదర్శిణి యొక్క పెళ్లి కానప్పటి ఫోటో బయటకు వచ్చింది. అది కూడా ఆమె భర్త సుధీర్‌ బాబు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. పెళ్లి చూపుల సమయంలో నా వద్దకు వచ్చిన ఫోటో అన్నట్లుగా ప్రియదర్శిణి ఫోటోను సుధీర్ బాబు షేర్‌ చేశాడు.

హ్యాపీ యానివర్సరీ మై లవ్‌, నువ్వు నా జీవితాన్ని సంపూర్ణం చేశావు, నా దగ్గర ఉన్న నీ మొదటి ఫోటో, పెళ్లి చూపుల ఫోటో అంటూ స్మైల్‌ ఈమోజీ ని షేర్‌ చేశాడు. సుధీర్ బాబు లోని రొమాంటిక్ యాంగిల్‌ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

కృష్ణ మరియు మహేష్ బాబు ల ప్రోత్సాహం మరియు సహకారంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుధీర్ బాబు సొంత ఇమేజ్ ను దక్కించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం హరోమ్‌ హర సినిమా విడుదలకు రెడీ చేస్తున్నాడు. బాలీవుడ్‌ లో కూడా నటించిన ఘనత దక్కించుకున్నాడు.