Begin typing your search above and press return to search.

సుదీప్ కిచ్చా.. టాలీవుడ్ లో పెద్ద ప్లానే..

ఇప్పుడు తెలుగులో తన మార్కెట్ ని మరింత పెంచుకోవడం కోసం టాలీవుడ్ ప్రొడ్యూసర్ తో మూవీకి సైన్ చేశాడు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 4:27 AM GMT
సుదీప్ కిచ్చా.. టాలీవుడ్ లో పెద్ద ప్లానే..
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా ఇదే నిర్మాత చేయనున్నారు. ప్రశాంత్ వర్మ మీద నమ్మకంతో ఏకంగా 60 కోట్ల బడ్జెట్ ని ఒక చిన్న హీరో మీద నిరంజన్ రెడ్డి ఖర్చు పెట్టారు.

దానికి తగ్గ ప్రతిఫలం కూడా వచ్చింది. ఇదిలా ఉంటే ఈ నిర్మాత ఇకపై రెగ్యులర్ గా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా ఒక మూవీ చేయబోతున్నాడంట. కిచ్చా సుదీప్ కూడా అతని ప్రొడక్షన్ లో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అయితే ఈ మూవీ ఎవరి దర్శకత్వంలో ఉంటుందనేది క్లారిటీ లేదు.

కిచ్చా సుదీప్ కి కన్నడంలో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. తెలుగులో రాజమౌళి ఈగ మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో కనిపించాడు. ఆయన నటించిన విక్రాంత్ రోనా తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగులో తన మార్కెట్ ని మరింత పెంచుకోవడం కోసం టాలీవుడ్ ప్రొడ్యూసర్ తో మూవీకి సైన్ చేశాడు.

తమిళ్ హీరోలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. అయితే కోలీవుడ్ స్టార్స్ స్థాయిలో కన్నడ హీరోలు తెలుగు నాట ప్రభావం చూపించలేకపోయారు. కేజీఎఫ్ సిరీస్ తో రాకింగ్ స్టార్ యష్ కి స్టార్ హీరో ఇమేజ్ తెలుగులో వచ్చింది. కాంతారాతో రిషబ్ శెట్టి మెప్పించగలిగాడు. అలాగే రక్షిత్ శెట్టి కూడా ఈ మధ్య టాలీవుడ్ లో తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు. ఉపేంద్రకి కూడా తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

ఇప్పుడు కిచ్చా సుదీప్ కూడా తెలుగులో తన మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. నిరంజన్ రెడ్డి నిర్మాణంలో చేసే మూవీని స్ట్రైట్ తెలుగులో పాన్ ఇండియా మూవీగా చేస్తాడా లేదంటే కన్నడంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.