Begin typing your search above and press return to search.

వీర జవాన్ బయోపిక్ పై ఇలాంటి వివాదమా..!

ఈ సినిమా 2014 లో వీర మరణం పొందిన మేజర్ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 8:08 AM GMT
వీర జవాన్ బయోపిక్ పై ఇలాంటి వివాదమా..!
X

తమిళ యంగ్‌ స్టార్ శివ కార్తికేయన్‌ హీరోగా రాజ్ కుమార్‌ పెరియా స్వామి దర్శకత్వంలో కమల్ హాసన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం 'అమరన్‌'. ఈ సినిమా 2014 లో వీర మరణం పొందిన మేజర్ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

మేజర్ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథలోని ముఖ్య ఘట్టాలను తీసుకుని వాటికి కల్పిత కథ మరియు పాత్రలను జోడించి అమరన్‌ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కశ్మీర్‌ ముస్లీంలు మరియు ఇతర సున్నితమైన పాయింట్స్ ను టచ్ చేస్తూ కథ సాగనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఇటీవలే ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ లో కశ్మీర్‌ ముస్లీంలను తప్పుగా చూపించారనే విమర్శలు వస్తున్నాయి. అమరన్ సినిమాలో ఇండియన్ ఆర్మీకి ముస్లీంలు వ్యతిరేకం అన్నట్లుగా చూపించడంతో పాటు, అక్కడి వేర్పాటువాదానికి ముస్లీం లే కారణం అన్నట్లుగా సినిమాలో చూపించబోతున్నారు అంటూ ముస్లీంలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో వచ్చిన కొన్ని కమల్ సినిమాలు కూడా ఇలాంటి వివాదాలను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో కమల్‌ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాంతో ఇప్పుడు కూడా కమల్‌ అమరన్ విడుదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.

ఇప్పటికే టిఎంజీకే సంఘం సభ్యులు ఆందోళన మొదలు పెట్టారు. దర్శక నిర్మాత మరియు హీరోను అరెస్ట్‌ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ముస్లీంలను అవమానిస్తూ రూపొందించిన ఆ సినిమా విషయంలో ముందు ముందు ఎలాంటి విభేదాలు తలెత్తుతాయో చూడాలి.

కమల్‌ హాసన్ ఒక వైపు హీరోగా నటిస్తూ వరుసగా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న ఇతర సినిమాలకు ఇబ్బంది లేదు కానీ అమరన్ సినిమా విషయంలో మాత్రం విడుదల సమయంలో జాతీయ స్థాయిలో ఆందోళనలు ఎదుర్కోవాల్సి రావచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీర జవాన్ బయోపిక్ కు ఇలాంటి వివాదం ఎదురు అవ్వడం విచారకరం అంటూ సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.