Begin typing your search above and press return to search.

18 ఏళ్ల కెరీర్ లో హ‌నీ రోజ్ కి అలాంటి అనుభూతి!

నా 18 ఏళ్ల సినీ జీవితంలో మొద‌టిసారి ఇలాంటి గొప్ప మ‌హిళా ద‌ర్శ‌కురాలితో క‌లిసి ప‌నిచేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 11:30 PM GMT
18 ఏళ్ల కెరీర్ లో  హ‌నీ రోజ్ కి  అలాంటి అనుభూతి!
X

'వీర‌సింహారెడ్డి' సినిమాతో హాట్ బ్యూటీ హ‌నీరోజ్ టాలీవుడ్ లో ఎంత ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌కు ముందే ఇన్ స్టాలో హాట్ హాట్ రీల్స్ లో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ క్రేజ్ సినిమాకి ప‌నికొచ్చింది. అయితే అమ్మ‌డి టాలీవుడ్ జ‌ర్నీ ఇప్పుడు కాదు చాలా కాలం క్రిత‌మే జ‌రిగింది. ప‌దేళ్ల క్రిత‌మే 'ఆల‌యం' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అటుపై 'ఈ వ‌ర్షం సాక్షిగా' అనే మ‌రో సినిమాలో న‌టించింది.

కానీ ఆ రెండు సినిమాల గురించి జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌దు. అలా హ‌నీరోజ్ కూడా హైలైట్ కాలేదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియానే షేక్ చేస్తోన్న బ్యూటీగా మారిపోయింది. అమ్మ‌డి ఫోటో...వీడియో ఏది వ‌చ్చినా అది నెట్టింట వైరల్ సంచ‌ల‌నం త‌ప్ప‌నిస‌రి. ప్ర‌స్తుతం మాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మాత్రం బిజీగానే ఉంది. చేసింది.'రాహేలు' అనే ఓ పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతుంది. ఈ చిత్రాన్ని ఆనంది బాల తెర‌కెక్కిస్తున్నారు.

తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా హ‌నీరోజ్ ఆ అనుభూతుల్ని పంచుకుంది.'ఈ సినిమా నా జీవితంలో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది. మీరు అందించే ప్రేమ‌..మ‌ద్ద‌తు..అభిమానం నన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నా. గ‌డిచిన 30 రోజులు నా జీవితంలో మ‌ర్చిపోలేని ఒక చాప్ట‌ర్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగ‌మ‌వ్వ‌డం ప్ర‌త్యేక‌మైన అనుభూతినిస్తుంది.

నా 18 ఏళ్ల సినీ జీవితంలో మొద‌టిసారి ఇలాంటి గొప్ప మ‌హిళా ద‌ర్శ‌కురాలితో క‌లిసి ప‌నిచేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది. ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుందా? అని కొన్నేళ్ల‌గా ఎదురుచూస్తున్నా. మహిళ‌ల‌తో ప‌నిచేయ‌డ‌మంటే ఎన్నో విష‌యాలు షేర్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఆ అవ‌కాశం నాకు ఈ సినిమా ద్వారా దొరికింది. సినిమా బాగా వ‌స్తుంది. అంద‌రికీ న‌చ్చే కాన్సెప్ట్ ఇది.