Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్డ్‌

తెలుగు బిగ్‌ బాస్‌ ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితం అయిన ముద్దుగుమ్మ శుభశ్రీ. ఈమె తెలుగు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు

By:  Tupaki Desk   |   6 Jun 2025 11:32 AM
పిక్‌టాక్‌ : బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్డ్‌
X

తెలుగు బిగ్‌ బాస్‌ ద్వారా బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితం అయిన ముద్దుగుమ్మ శుభశ్రీ. ఈమె తెలుగు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగుతో పాటు తమిళ్‌ ఇతర భాషల్లోనూ ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే. కానీ ఆ సినిమాలు ఏవీ ఈమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ ఈమెకు తెలుగులో బిగ్‌ బాస్‌ ద్వారా లభించిన గుర్తింపు అంతా ఇంతా కాదు. కేవలం బిగ్‌ బాస్ వల్లే సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోవర్స్ లక్షల్లో పెరిగారు. అంతే కాకుండా బిగ్‌ బాస్ తర్వాత చాలా సినిమాల్లో ఈ అమ్మడికి నటించే అవకాశాలు దక్కాయి. అంతే కాకుండా బుల్లి తెరపై రెగ్యులర్‌గా కనిపించే అవకాశం దక్కించుకుంది.

తెలుగు నటి కాకున్నా కూడా ఇక్కడ చాలా కాలంగా కొనసాగుతున్న శుభ శ్రీ కొత్త జీవితంలో అడుగు పెట్టింది. ఒడిశాకు చెందిన ఈ అమ్మడు తన జీవితంలో కీలకమైన అడుగు వేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్‌ మీడియా ద్వారా ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రెగ్యులర్‌గా అభిమానులను అలరిస్తూ వస్తున్న శుభశ్రీ తాజాగా తన వివాహ నిశ్చితార్థ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎట్టకేలకు నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాను అంటూ ప్రకటించింది. తాజాగా శుభశ్రీ తన నిశ్చితార్థ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

చాలా రోజులుగా శుభశ్రీ ప్రేమలో ఉంది. ఆ విషయాన్ని కొద్ది మందితో షేర్ చేసుకున్న ఈమె మీడియా కు మాత్రం తెలియకుండా ఉంచింది. అప్పుడప్పుడు శుభశ్రీ వెంట కనిపించినప్పటీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. శుభశ్రీ ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. కానీ నటిగా చాలా సినిమాల్లో ఆమె నటించింది. ప్రాముఖ్యత లేని పాత్రల్లో నటిస్తూ వస్తున్న ఈమె నిర్మాత అజయ్ మైసూర్‌ను వివాహం చేసుకోబోతుంది. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారట. వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దాంతో తాజాగా వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇదే ఏడాదిలో వీరి వివాహం వైభవంగా జరగబోతుంది.

వివాహ నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు, ఎట్టకేలకు మా నిశ్చితార్థం జరిగిందని సోషల్‌ మీడియా ద్వారా చెప్పడంతో శుభశ్రీ అందరికీ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా తనకు కాబోయే భర్తను సైతం పరిచయం చేసింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం శుభశ్రీ ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. నిర్మాతగా అజయ్ మైసూర్‌ పలు ప్రాజెక్ట్‌లను చేశాడట. ముందు ముందు శుభశ్రీ హీరోయిన్‌గా అజయ్ మైసూర్‌ ఒక సినిమాను తీస్తాడేమో చూడాలి. శుభశ్రీ రాయగురు బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 లో ఉన్నది కొన్ని వారాలే అయినా కూడా ప్రేక్షకులకు సుపరిచితురాలు గా నిలిచింది. అందుకే ఈమె వివాహ నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.