సమంత కొత్త బిజినెస్ ఎలా ఉంటుందో రేపు తెలుస్తుంది
నటిగా ఎన్నో సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పించిన సమంత ఇప్పుడు శుభం అనే సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెడుతుంది.
By: Tupaki Desk | 29 March 2025 6:00 PM ISTఏ మాయ చేసావే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. మొదటి సినిమానే హిట్ అవడంతో సమంతకు టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. అలా సౌత్ లో ఉన్న అగ్ర హీరోలందరితో నటించి అగ్ర హీరోయిన్ గా మారింది సమంత.
నటిగా ఎన్నో సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పించిన సమంత ఇప్పుడు శుభం అనే సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసి ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన సమంత ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఓ అనౌన్స్‌మెంట్ ను చేసి దానిపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
శుభం టీజర్ లాంచ్ విషయాన్ని అనౌన్స్ చేస్తూ సమంత ఇన్‌స్టాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. మార్చి 30న టీజర్ రిలీజ్, శుభం అంటూ సమంత షేర్ చేయగా, వెంటనే త్రలాలా మూవింగ్ పిక్చర్స్ కూడా ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ టైటిల్ రివీల్ వీడియోను రిలీజ్ చేసింది. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో కొత్తగా, ఇన్నోవేటివ్‌గా ఉంటూ శుభం సినిమాపై అంచనాలను పెంచుతోంది.
సినిమా నిర్మాణమంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. సమంత సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టినప్పటికీ నటిగా సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు. ఓ వైపు నిర్మాతగా సినిమాలు చేస్తూనే మరోవైపు నటిగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది సమంత. ప్రస్తుతం రాజ్ & డీకే దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ లో నటిస్తోంది సమంత.
రీసెంట్ గా సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ తో ప్రేక్షకుల్ని మెప్పించిన సమంత, ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ లో నటిస్తోంది. దీని కోసం సమంత యాక్షన్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే కేవలం సినిమాల్లోనే కాకుండా సమంత ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా దూసుకెళ్తుంది. ఆల్రెడీ ఫ్యాషన్, బ్యూటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో పలు వెంచర్లను సక్సెస్‌ఫుల్ గా రన్ చేస్తున్న సమంత నిర్మాతగా కూడా మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
