Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీకి మరో వారసుడు.. హిట్‌ కొట్టేనా?

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది కామన్‌ విషయం. అన్ని భాషల ఇండస్ట్రీలోనూ వారసులు ఉంటారు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 8:30 AM IST
ఇండస్ట్రీకి మరో వారసుడు.. హిట్‌ కొట్టేనా?
X

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది కామన్‌ విషయం. అన్ని భాషల ఇండస్ట్రీలోనూ వారసులు ఉంటారు. బాలీవుడ్‌లో హీరోల్లో ఎక్కువ శాతం వారసులు ఉన్నారు. హీరోయిన్స్‌లో కూడా ఎక్కువ మంది స్టార్‌ కిడ్స్ ఉన్న విషయం తెల్సిందే. నెపొటిజం అంటూ తీవ్ర విమర్శలు ఎదురు అయినా కూడా ఇండస్ట్రీలో వారసత్వం అనేది మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఏడాది కొత్తగా ఎంతో మంది వారసులు ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు. త్వరలో బాలీవుడ్‌లో కొత్త వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ సాజిద్‌ నదియాద్వాలా తనయుడు శుభాన్‌ త్వరలో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు. అందుకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క్ జరుగుతుంది.

శుభాన్‌ ఇండస్ట్రీలో పరిచయం కావడం కోసం గత కొన్ని నెలలుగా సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం ఇతడు నటనతో పాటు, డాన్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో శుభాన్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు. బాలీవుడ్‌లో ఇప్పటికే ధడక్‌, హంప్టీ శర్మ కీ దుల్హానియా సినిమాలకు దర్శకత్వం వహించిన శశాంక్‌ ఖైతాన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. 1992లో వచ్చిన షారుఖ్‌ ఖాన్‌, దివ్య భారతి కలిసి నటించిన దీవానా సినిమాలోని పాట పల్లవిని ఈ సినిమాకు టైటిల్‌గా అనుకున్నారు. ఈ టైటిల్‌ను చాలా కాలంగా సాజిద్‌ హోల్డ్‌ చేసి పెట్టినట్లు సమాచారం అందుతోంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో యంగ్‌ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేక పోతున్నాయి. కొత్త హీరోల సినిమాలు కనీసం ప్రేక్షకుల్లో నోటెడ్‌ కావడం లేదు. అయినా కూడా ఇండస్ట్రీలో కొత్త వారు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్‌ విషయం. అనేక మంది హీరోలు, హీరోయిన్స్‌ ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌లు దక్కక పోవడంతో వెనక్కి వెళ్లి పోతున్నారు. ఇండస్ట్రీలో ఎంట్రీకి వారసత్వం సాయం అవుతుంది. కానీ హిట్‌ కావాలంటే మాత్రం ప్రతిభ అవసరం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోలు రెండు మూడు వరుస ఫ్లాప్స్ పడితే కనిపించకుండా పోతున్నారు. సూపర్‌ స్టార్‌ హీరోల వారసులు కూడా కనిపించకుండా పోయిన వారి జాబితాలో ఉన్నారు.

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కించుకున్న సాజిద్‌ వారసుడు కావడంతో సహజంగానే అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగా మొదటి సినిమాను శశాంక్ ఖైతాన్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది నవంబర్‌ నుంచి షూటింగ్‌ ప్రారంభించడం కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ చేస్తున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇండస్ట్రీకి రాబోతున్న ఈ కొత్త వారసుడు ఏ మేరకు సక్సెస్‌ అవుతాడు, ఇండస్ట్రీలో ఇతడి యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేది మొదటి సినిమాతో ఎంతో కొంత తేలిపోతుంది. ఆ తర్వాత నుంచి ఈయన ఎంపిక చేసుకునే సినిమాల ఆధారంగా, వాటి ఫలితం ఆధారంగా కెరీర్‌ ఉంటుంది.