Begin typing your search above and press return to search.

స్ట్రీమింగ్ కి వచ్చేసిన హార్రర్ కామెడీ డ్రామా సు ఫ్రమ్ సో.. ఎక్కడ.. ఏ భాషలో చూడొచ్చంటే?

ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. పైగా తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ హిట్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   9 Sept 2025 1:00 PM IST
స్ట్రీమింగ్ కి వచ్చేసిన హార్రర్ కామెడీ డ్రామా సు ఫ్రమ్ సో.. ఎక్కడ.. ఏ భాషలో చూడొచ్చంటే?
X

ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. పైగా తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ హిట్ అవుతున్నాయి. నిజానికీ భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరుస్తుంటే.. తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. అలా వచ్చి హిట్ అయిన సినిమాల్ని ఇప్పటికే మనం ఎన్నో చూసాం. అందులో ముఖ్యంగా కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు అయితే అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి వందల కోట్ల లాభాలను కూడా తీసుకొస్తున్నాయి. ఇప్పుడు వీటి బాటలోనే చిన్న సినిమాగా వచ్చి.. కంటెంట్ బాగుండడంతో అతిపెద్ద హిట్ అయ్యి.. ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన సు ఫ్రమ్ సో..

మరి ఇంతకీ ఓటీటీ లోకి వచ్చేసిన ఆ సినిమా ఏంటంటే.. జెపీ తుమినాడ్ డైరెక్షన్ తో పాటు స్వయంగా లీడ్ రోల్ లో నటించిన కన్నడ మూవీ 'సు ఫ్రమ్ సో'. అతి తక్కువ బడ్జెట్ తో విడుదలై భారీ హిట్ అయింది. ఈ సినిమా కంటెంట్ బాగుండడంతో తెలుగు, మలయాళ భాషల్లోకి కూడా డబ్ చేశారు. అలా ఈ సినిమా కేవలం రూ.4.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. మొదటి రోజు రూ.78 లక్షలు కలెక్ట్ చేసింది. అయితే ఫస్ట్ డే కావడంతో పాటు చిన్న సినిమా కాబట్టి.. పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఈ మూవీ మొదటిరోజు కోటి లోపలే కలెక్ట్ చేసింది. కానీ ఫస్ట్ డే సినిమా చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందని రివ్యూ ఇవ్వడంతో పాటు మౌత్ టాక్ బలంగా ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లిపోయి.. కేవలం రెండు వారాల్లోనే ఇండియా వైడ్ గా రూ.43 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.120 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సు ఫ్రమ్ సో..

అలా ఇండస్ట్రీని షేక్ చేసిన కన్నడ మూవీ సు ఫ్రమ్ సో తాజాగా ఓటీటీ లోకి వచ్చేసింది.ఈ మూవీ జియో హాట్ స్టార్ లో సెప్టెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది. కానీ నాలుగు రోజుల ఆలస్యంతో సెప్టెంబర్ 9 మంగళవారం అనగా ఈరోజు నుండి జియో హాట్ స్టార్ లో తెలుగు, మలయాళ, కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

సు ఫ్రమ్ సో సినిమా స్టోరీ..

సు ఫ్రమ్ సో సినిమా విషయానికి వస్తే..హారర్ కామెడీ-థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా రియల్ ఇన్స్టెంట్లను ఆధారంగా తీసుకొని దర్శకుడు తెరకెక్కించారట.తమ ఊర్లో జరిగిన కొన్ని రియల్ సంఘటనలను ఆధారంగా చేసుకొని జెపి తుమినాడ్ ఈ సినిమా తీశారు. ఒక పల్లెటూర్లో ఎంతో యాక్టివ్ గా ఉండే కుర్రాడిని ఆడ దెయ్యం ఆవహించిందని ఊరంతా నమ్ముతారు. మరి ఆ దయ్యాన్ని ఎలా వదిలిస్తారు అనేదే ఈ సినిమా స్టోరీ.థియేటర్లలో ఈ సినిమా చూడకపోతే ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.