Begin typing your search above and press return to search.

స్టైలిష్‌స్టార్ నుంచి ఐకాన్ స్టార్.. ఇప్పుడైనా అంగీక‌రిస్తారా?

అయితే ఇప్పుడు అలాంటి నామోషీ ఫీలైనవారు కూడా బ‌న్నీని జాతీయ ఉత్త‌మ న‌టుడుగా గౌర‌విస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:18 PM GMT
స్టైలిష్‌స్టార్ నుంచి ఐకాన్ స్టార్.. ఇప్పుడైనా అంగీక‌రిస్తారా?
X

అల్లు అర్జున్ కి స్టైలిష్‌స్టార్ అనే బిరుదు ఇచ్చిన‌ప్పుడు కొన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లొచ్చాయి. అప్పుడే స్టైలిష్ స్టార్ బిరుదు ఇచ్చేస్తారా? అన్నారు. ఇక పుష్ప స‌మ‌యంలో 'ఐకాన్ స్టార్' అంటూ సుకుమార్ అత‌డి బిరుదును ప్ర‌మోట్ చేసాడు. దానిపైనా కొన్ని సెక్ష‌న్లు ఎగ‌తాళిగా ప్ర‌చారం చేసాయి. సోష‌ల్ మీడియా యుగంలో ప్ర‌తిదీ నెగెటివిటీని పెంచి పోషించింది. కానీ ఇప్పుడు ఆ నెగెటివిటీ అంతా మాయ‌మయ్యే చికిత్స చేశాడు బ‌న్ని. ఇటీవ‌ల‌ ఎటు చూసినా అత‌డి చుట్టూ పాజిటివిటీనే క‌నిపిస్తోంది.

ఒక స్టార్‌లో ఉన్న క్వాలిటీని ఎలివేట్ చేస్తూ ఆయా సంద‌ర్భాల్లో అభిమానులు లేదా స‌హ‌చ‌రులు ఇలా బిరుదులిచ్చి అభిమానంగా పిలుచుకోవ‌డం అన్న‌ది అనాదిగా వ‌స్తున్నదే. చిరంజీవిని సుప్రీంహీరో, మెగాస్టార్ అంటూ బిరుదులిచ్చి గౌర‌వించారంటే ఆయ‌న‌లోని క్వాటిటీని చూడ‌టం వ‌ల్ల‌నే. అలానే బ‌న్నీని స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అంటూ బిరుదులిచ్చి ప్రేమ‌గా పిలుచుకున్నారు. కానీ దీనిని అంగీక‌రించేందుకే నామోషీ ఫీల‌యిన వాళ్లు ఉన్నారు.

అయితే ఇప్పుడు అలాంటి నామోషీ ఫీలైనవారు కూడా బ‌న్నీని జాతీయ ఉత్త‌మ న‌టుడుగా గౌర‌విస్తున్నారు. పుష్ప చిత్రంలో అద్భుత న‌ట‌న‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మెప్పు పొందిన బ‌న్నీకి ఇది స‌రైన స‌త్కారం అంటూ ప‌దే ప‌దే త‌న గురించి పొగిడేస్తున్నారు. నెటిజ‌నుల్లో వ్య‌తిరేక వ‌ర్గం కూడా ఇప్పుడు బ‌న్నీని ప్ర‌శంసిస్తోంది. నిజానికి జాతీయ స్థాయిలో తొలి తెలుగు ఉత్త‌మ న‌టుడుగా బ‌న్ని అర్హ‌త సాధించ‌డం అన్న‌ది అసాధార‌ణ‌మైన ప్ర‌క్రియ‌. దీనికోసం అత‌డు అహోరాత్రులు శ్ర‌మించాడు. ఎంత‌గానో త‌పించాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచుతూనే త‌న స్థాయిని పెంచుకునేందుకు అత‌డు అనుస‌రించిన ఎత్తుగ‌డ‌లు ఎంతో గొప్ప ఫ‌లితాన్నిచ్చాయి. బ‌న్ని ఇప్పుడు తెలుగు సినిమాకి గొప్ప బ‌లం. ఇటీవ‌ల‌ అత‌డికి గ్లోబ‌ల్ స్థాయిలో ఫాలోయింగ్ ఏర్ప‌డింది. మునుముందు పుష్ప 2 తో దానిని రెట్టింపు చేస్తాడ‌ని అంచ‌నాలున్నాయి.

మ‌రోవైపు బ‌న్నీకి ఈ స్థాయి ప్రాచుర్యం వ‌చ్చాక‌.. పాపుల‌ర్ ఇన్‌స్టాగ్ర‌మ్ సైతం అత‌డిని ఫాలో చేస్తూ లైఫ్ స్టైల్ కి సంబంధించిన‌ ఒక వీడియోని షేర్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇన్‌స్టానే అత‌డిని అనుస‌రించ‌డం అంటే ఆషామాషీనా? ఇలాంటి గౌర‌వం ఏ ఇత‌ర తెలుగు హీరోకి ద‌క్క‌లేదు. నిజానికి భార‌త‌దేశంలోనే అల్లు అర్జున్ ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి హీరో అయ్యాడు. త‌న‌దైన న‌ట‌న ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు యూనిక్ స్టైల్స్ తో బ‌న్ని ఇప్పుడు జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తున్నాడు. పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా ఎదిగాడు. హాలీవుడ్ స్టార్ల‌ను కూడా కొట్టేసే గొప్ప పెర్ఫామెన్సెస్ అత‌డి నుంచి దూసుకొస్తాయ‌ని అభిమానులు ఆశిస్తున్నారు.