ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్.. హీరోయిన్ల పరిస్థితి అలా ఉందా?
అవకాశాల కోసం కావాలంటే తమ రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. మెయిన్ గా బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్.
By: Tupaki Desk | 6 Jun 2025 4:00 AM ISTహీరోయిన్.. ఏ మూవీలో కచ్చితంగా అయినా ఉండాల్సిందే. అప్పుడే సినిమా ఫుల్ ఫిల్ అవుతుంది! అందుకు గాను ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్లు వెలుగులోకి వస్తూనే ఉంటారు. సిల్వర్ స్క్రీన్ పై తమ లక్ ను టెస్ట్ చేసుకుంటారు బ్యూటీలు. కొందరు.. డెబ్యూతో అదరగొట్టేస్తారు. మరికొందరు మెల్లగా క్లిక్ అవుతుంటారు.
అయితే సక్సెస్ దక్కాలని ప్రతి ఒక్క హీరోయిన్ ఆరాటపడుతుంటారు. ఒక్క హిట్ కొడితే చాలు.. సూపర్ క్రేజ్.. స్పెషల్ ఫ్యాన్ బేస్ ఆమె సొంతం. అయితే కొంతకాలంగా ఒక్క హిట్ పడిన వెంటనే.. సదరు హీరోయిన్లు వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. ఒక మూవీతో అలరించారంటే.. నెక్స్ట్ కొన్ని సినిమాలకు వాళ్లే ఫిమేల్ లీడ్స్.
మొత్తానికి అది సెంటిమెంటో లేక ఫ్యాన్స్ నచ్చారని తీసుకుంటున్నారో లేక మార్కెట్ ను దృష్టిలో పెట్టి అలా చేస్తున్నారో తెలియదు.. కానీ జరగడం మాత్రం జరుగుతోంది. ఒక ట్రెండ్ గా కూడా మారిపోయింది. కానీ దాని వల్ల ఇప్పుడు పలువురు హీరోయిన్స్ చాలా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఛాన్సులు రాక బాధపడుతున్నారట.
అవకాశాల కోసం కావాలంటే తమ రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. మెయిన్ గా బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్.. టాలీవుడ్ కు వచ్చి సందడి చేస్తున్నారు. ఒకటి తర్వాత మరొక సినిమాను లైన్ లో పెట్టేస్తున్నారు. దీంతో కొందరు బ్యూటీలు తమకు ఛాన్సులు రాక ఇబ్బంది పడుతున్నారట!
అదే సమయంలో ఇప్పుడు కొందరు హీరోయిన్లు కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా మూవీ ఛాన్స్ కోసం డైరెక్టర్లకు, నిర్మాతలకు ఫోన్లు చేస్తున్నారట. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుగుతున్నారని సమాచారం. రెమ్యునరేషన్ ఎంత కావాలో చెప్పకుండా.. వారికే డిసెషన్ కూడా వదిలేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
మరికొందరు.. రెమ్యునరేషన్ బాగా తగ్గించి మరీ మేకర్స్ కు ఫోన్ చేసి చెబుతున్నారట. టాప్ హీరోయిన్స్ కు ఇచ్చిన దాంట్లో తమకు సగం కన్నా తక్కువ ఇచ్చినా పర్లేదు అని చెబుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే ప్రాజెక్టులు కూడా సైన్ చేస్తామని అంటున్నట్లు సమాచారం. హిట్స్ లేక.. అవకాశాలు రాక.. అలా చేస్తున్నట్లు టాక్. ఎలా అయినా మళ్లీ మంచి హిట్ అందుకుని.. వరుస ఛాన్స్ లు అందుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారని సమాచారం.
