ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసిన వెబ్ సిరీస్..!
ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులకు సుపరిచితమైన వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్'. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
By: Tupaki Desk | 24 Dec 2025 3:00 PM ISTప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులకు సుపరిచితమైన వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్'. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్‌లు స్ట్రీమింగ్ అయిన విషయం తెల్సిందే. ప్రతి సీజన్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం చివరిది అయిన అయిదవ సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. గత నెలలో కొన్ని ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా ఈ నెలలో కొన్ని ఎపిసోడ్స్ ను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఎప్పటిలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 5 కి మంచి స్పందన వచ్చింది. దాంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ గురించి చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్నో రకాల వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ వెబ్ సిరీస్ ను చాలా స్పెషల్‌గా అంతా చూస్తూ ఉంటారు. ఈ వెబ్ సిరీస్ చాలా పరిస్థితులను మార్చింది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ ను అంతర్జాతీయ స్థాయిలో టాప్‌లో ఉంచడంలో కీలక పాత్ర పోషించింది అని అంతర్జాతీయ స్థాయి ఓటీటీ కంటెంట్ పరిశీలకులు అంటూ ఉంటారు.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్...
స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ మొదటగా 2016, జులై 15న మొదటి సీజన్ స్ట్రీమింగ్ అయింది. ఆ సమయంలో నెట్‌ఫ్లిక్స్ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ సమయంలో అమెరికాలో ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారుల సంఖ్య అమాంతం పెరిగింది. అదే సమయంలో ఇతర దేశాల్లో కూడా ఈ ఓటీటీ కంటెంట్ కి ఆధరణ లభించింది. ఈ వెబ్ సిరీస్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ ను చాలా దేశాల్లో చూడటం మొదలు పెట్టారు అంటారు. అత్యధిక వ్యూస్ ఉన్న వెబ్ సిరీస్‌ల జాబితాలో స్ట్రేంజర్ థింగ్స్ ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం నెట్‌ఫ్లిక్స్ స్థాయిని మాత్రమే ఈ వెబ్ సిరీస్ పెంచలేదు.. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసింది అంటారు. ఈ వెబ్ సిరీస్ ఎక్కువగా జార్జియాలో చిత్రీకరించడం జరిగింది. అక్కడ ఈ వెబ్ సిరీస్ ను చిత్రీకరించడం ద్వారా మొత్తం దేశం యొక్క స్థితి గతి మారింది అంటారు.
జార్జియాలో షూటింగ్...
జార్జియా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్ చేయాలి అంటే ముందు గుర్తుకు వచ్చే దేశం. ఇండియన్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు కూడా చాలా వరకు జార్జియాలో షూటింగ్ జరగడం మనం చూస్తూ ఉంటాం. దేశ వ్యాప్తంగా అనేక అందమైన ప్రదేశాల్లో షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున టూరిజం, షూటింగ్స్ కోసం రావడంతో జార్జియా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. అంతే కాకుండా టూరిజం, షూటింగ్ వల్ల దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడింది అంటున్నారు. షూటింగ్స్ తో దేశ వ్యాప్తంగా ఎప్పుడూ టూరిస్ట్‌లు పర్యటిస్తూ ఉండటం వల్ల స్థానిక వ్యాపారాలు బాగా అభివృద్ది చెందాయి. కేవలం స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ కారణంగానే జార్జియా యొక్క ఆర్థిక వ్యవస్థ ఇలా టూరిజంపై ఆధారపడి అభివృద్ది చెందింది అని చెప్పేవారు ఎక్కువ మంది ఉన్నారు. ముందు ముందు కూడా షూటింగ్స్ కు ఎక్కువగా ఈ దేశంకు వెళ్లే వారు ఎక్కువ కావచ్చు.
స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్...
స్ట్రేంజర్ థింగ్స్ ను డఫర్ బ్రదర్స్ రూపొందించారు. మంకీ మాసేకర్ ప్రొడక్షన్స్, 21 ల్యాప్స్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ చివరి సీజన్ ఈ డిసెంబర్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హర్రర్, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, పాంటసీ ఇలా అనేక జోనర్‌లలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సిరీస్ ను చిత్రీకరించిన విధానం మాత్రమే కాకుండా, ఎంపిక చేసుకున్న లొకేషన్స్ సైతం చాలా ఆకట్టుకుంటాయి. అందుకే జార్జియాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. జార్జియా దేశంలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ చేసిన కారణంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కిందని ఆ దేశ నాయకులు అంటూ ఉంటారు. ఆ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటి వరకు 1.2 బిలియన్‌ల వ్యూస్ ను సొంతం చేసుకుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకున్న అతి కొద్ది సిరీస్‌ల్లో ఇది ముందు ఉంటుంది. ఈ సిరీస్ ను అభిమానించే వారు ఇదే చివరి సీజన్ కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
