Begin typing your search above and press return to search.

'STR48'.. నెవర్ బిఫోర్ లుక్ లో క్రేజీ హీరో!

ఇక ఈరోజు శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 1:07 PM GMT
STR48.. నెవర్ బిఫోర్ లుక్ లో క్రేజీ హీరో!
X

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన శింబు మానాడు, లైఫ్ ఆఫ్ ముత్తు వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ కొట్టారు. ప్రస్తుతం వెట్రి మారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత విశ్వ నటుడు కమలహాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తన 48వ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.


ఇక ఈరోజు శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. మునుపెన్నడూ కనిపించని విధంగా శింబు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అంతేకాదు పోస్టర్ చూస్తుంటే ఇదొక డిఫరెంట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ అని అర్థమవుతుంది. అలాగే పోస్టర్లో శింబు రెండు గెటప్స్ లో ఎదురెదురుగా కనిపించడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.

ఈ రెండు గెటప్స్ లో శింబు పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్లో ఇద్దరు ఇలా ఎదురెదురుగా చూసుకోవడాన్ని బట్టి శింబు ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అందులో ఓ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని అర్థమవుతుంది. మొత్తంగా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలను పెంచేశారు మేకర్స్.

'STR48' అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్‌ సంస్థలో ఇది 56వ ప్రాజెక్ట్ ఈ చిత్రం శింబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం దాదాపుగా రూ.100కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు సమాచారం అందుతుంది.

ఇక ఈ సినిమాలో శింబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. కానీ దీనిపై మూవీ టీమ్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కమల్ హసన్ నిర్మాణంలో శింబు తొలిసారి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటూ టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.